సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స‌ర్పంచ్ కూతురా.. నిన్ను ఎక్కించి తిప్పుతా! రాహుల్ సిప్లీగంజ్ కొత్త ఫోక్ సాంగ్ అదిరిపోయింది

ABN, Publish Date - Jul 15 , 2026 | 11:22 AM

చాలా రోజుల త‌ర్వాత యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు మ‌రో జాన‌ప‌ద గీతం వ‌చ్చేసింది.

Rahul Sipligunj

చాలా రోజుల త‌ర్వాత యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు మ‌రో జాన‌ప‌ద గీతం వ‌చ్చేసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రూర‌ల్ సింగ‌ర్స్‌, లిరిసిస్టులు రూపొందించిన పాట‌లు సంచ‌ల‌నాలు సృష్టిస్తుండగా ఇప్పుడు సినిమా రంగంలో త‌మ కంటూ ప్ర‌త్యేక పేజీలు లిఖించుకున్న కీర‌వాణి, చంద్ర‌బోస్‌, కాంచీ వంటి ఉద్దండులు స్వ‌యంగా రంగంలోకి దిగి ఈ ఫోక్ సాంగ్‌ను రూపొందించ‌డం విశేషం.

ఈ క్ర‌మంలోనే.. 'స‌ర్పంచ్ కూతురా.. స‌ర్పంచ్ కూతురా నిన్నిడిచి నేనుండ‌లేనే.. నిన్ను ఎక్కించి తిప్పుతా ఎక్కించి తిప్పుతా నేను కొన్న కొత్త బైక్ పైనే' ( SARPANCH KUTHURU) అంటూ సాగే హుషారైన పాట‌ను బుధ‌వారం త‌మ లెథోవిస్ (Lethovis) యూట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేశారు. కొత్త‌గా పెళ్లి చేసుకున్న యువ‌కుడు త‌న త‌ల్లి ఎదుటే భార్య గురించి పొగుడుతూ తాను ఎలా చూసుకుంటానో వ‌ర్ణిస్తూ పాట సాగింది. అయితే.. ఈ పాట వింటున్నంత సేపు గ‌తంలో విన్న ఒక‌టి రెండు పాట‌ల ట్యూన్స్ గుర్తుకు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇప్ప‌టికే సినిమా సాంగ్స్‌, ప్రైవేట్ సాంగ్స్‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న రాహుల్ సిప్లీగంజ్ (Rahul Sipligunj) చాలా గ్యాప్ త‌ర్వాత ఈ పాట ఆల‌పించడ‌మే గాక న‌టించ‌డం విశేషం. ఈ గీతానికి ఆస్కార్ విన్న‌ర్స్ చంద్ర‌బోస్ (CHANDRABOSE ) సాహిత్యం అందించ‌గా, కీర‌వాణి సంగీతం అందించారు. ఇక కీర‌వాణి కుటుంబం నుంచి కాంచీ, సీత‌, సింగ‌ర్ నోయ‌ల్ సీన్ సైతం ఇందులో పాలు పంచుకున్నారు. ఈ పాట‌లో రాహుల్‌తో క‌లిసి సిరి రాశి (Siri Raasi), బాంబే ప‌ద్మ (Bombay Padma) న‌టించ‌గా చిట్టి మాస్ట‌ర్ నృత్యం స‌మ‌కూర్చారు. కాంచి (SS KANCHI) ఈ పాటకు దర్శకత్వం వ‌హించాడు.

Updated Date - Jul 15 , 2026 | 12:55 PM