చెక్ బౌన్స్ కేసు.. బండ్ల గణేష్ కి ఏడాది జైలు
ABN, Publish Date - Nov 18 , 2026 | 06:09 PM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) కు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) కు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి, బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరిట రూ. 95 లక్షల విలువైన చెక్కును ఇవ్వడం జరిగింది.
అయితే బ్యాంక్ ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయ్యింది. డబ్బుల చెల్లింపు విషయంలో సరైన స్పందన లేకపోవడంతో బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో బండ్ల గణేష్‌ను దోషిగా తేల్చింది. ఏడాది జైలు శిక్ష, రూ. 95 లక్షల జరిమానాతో పాటు.. కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా ఆయనే పూర్తిగా భరించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు నెల రోజుల గడువు లభించినట్లు సమాచారం. గతంలోనూ 2017లో దర్శకుడు వక్కంతం వంశీకి సంబంధించిన వ్యవహారంతో సహా పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్‌కు కోర్టులు శిక్షలు విధించగా, ఆయన పైకోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లాడు. తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక కోర్టు తీర్పుపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉన్నాయి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.