సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాని 'ది ప్యార‌డైజ్'.. ఆయా షేర్ ప్రోమో

ABN, Publish Date - Feb 23 , 2026 | 12:21 PM

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ది ప్యార‌డైజ్.

nani

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం 'ద ప్యార‌డైజ్' (The Paradise). 'స‌రిపోదా శ‌నివారం' తర్వాత వస్తున్న సినిమా కావడం, గతంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని 'దసరా' మూవీ చేయడంతో ఈ తాజా చిత్రంపై అంచనాలు ఆకాశ‌మే హ‌ద్దుగా ఉన్నాయి. 'ద ప్యారడైజ్' మూవీ ఆగస్టు 21న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ 'ఆయా షేర్' (Aaya Sher) కు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. పూర్తి పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పాట‌ను కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్. ఆయన ఆధ్వ‌ర్యంలో వంద‌లమంది డ్యాన్స‌ర్ల న‌డుమ నాని, సంపూర్ణేశ్ బాబు త‌దిత‌ర న‌టుల‌పై భారీ సెట్‌లో దీనిని చిత్రీక‌రించారు. రాక్‌స్టార్ అనిరుధ్ (Anirudh Ravichander) ఈ పాట‌కు ఎలక్ట్రిఫైయింగ్ మాస్ ట్యూన్ అందించగా ఫుల్ జోష్‌లో సాంగ్ సాగింది.

Updated Date - Feb 23 , 2026 | 04:52 PM