Om Shanti Shanti Shantihi: కేవలం 99 రూపాయలకే సినిమా..
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:54 PM
కోట్ల రూపాయిలు బడ్జెట్ రికవరీ చేసుకోవాలంటే రేట్లు పెంచాల్సిందే.. రెండు, మూడు వారాల్లో అంతా వెనక్కి తెచ్చెకోవాల్సిందే.
Om Shanti Shanti Shantihi: కోట్ల రూపాయిలు బడ్జెట్ రికవరీ చేసుకోవాలంటే రేట్లు పెంచాల్సిందే.. రెండు, మూడు వారాల్లో అంతా వెనక్కి తెచ్చెకోవాల్సిందే. ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ల ప్రయాస.. కానీ ఆ ప్రొడ్యూసర్ మాత్రం.. ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. రికార్డులు కాదు.. ఆడియెన్స్ ను థియేటర్ కు తీసుకురావడమే టార్గెట్ గా ఊహించని అడుగు వేశాడు.
డైరెక్టర్ నుంచి హీరోగా మారిన తరుణ్ భాస్కర్( Tharun Bhascker) , అందాల భామ ఈషా రెబ్బా(Eesha Rebba) తో జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi)’ . ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మళయాళ హిట్ ‘జయ జయ జయ జయ హే’ రీమేక్‌గా వచ్చే ఈ సినిమాను ఏఆర్ సజీవ్ డైరెక్ట్ చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, ఫ్యామిలీ ఇష్యూస్‌ను హాస్యం, ఎమోషన్‌తో మిక్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్, ట్రైలర్‌తో ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాని వీలైనంత మందికి రీచ్ చేసేందుకు సాహసమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.
' ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆసక్తికర ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.99 మాత్రమే, మల్టీప్లెక్స్‌లలో రూ.150కి ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కొత్త సినిమా వస్తోందంటే చాలు టికెట్లు భారీగా పెంచుతున్న నేపథ్యంలో ఈ తక్కువ రేట్ల నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. అందరూ థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేసేలా ఈ స్టెప్ తీసుకున్నారని చాలా మంది అంటున్నారు.
మరో వైపు ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోఇప్పటికే కావాల్సినంత బజ్ వచ్చేసింది. తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఈషాపై తన అభిమానాన్ని ఓపెన్‌గా చెప్పాడు. మళయాళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో క్లైమాక్స్‌ను మార్చామని.. తనకు పర్సనల్‌గా నచ్చకపోయినా డైరెక్టర్ విజన్‌కు గౌరవం ఇచ్చి నటించానని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి 'ఓం శాంతి శాంతి శాంతిః’. గట్టి విజయమే సాధిస్తుందని అంతా అనుకుంటున్నారు.