Oh Sukumari Teaser: పాపం.. తిరువీర్.. మళ్ళీ అదే సమస్యనా

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:43 PM

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Thiruveer), ఐశ్యర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ సుకుమారి (Oh Sukumari).

Oh Sukumari

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Thiruveer), ఐశ్యర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ సుకుమారి (Oh Sukumari). మహేశ్వరరెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ సుకుమారి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


టీజర్ విషయానికొస్తే.. దామిని(ఐశ్వర్య రాజేష్)కి చిన్నతనం నుంచి దేవుడు ఒకటి తీసుకెళ్తే ఇంకా ఏదో గొప్పది ఇస్తాడు అని నమ్ముతూ పెరుగుతుంది. ఆమెకు మనుషులను ముట్టుకుంటే షాక్ కొట్టే ఒక సమస్య ఉంటుంది. ఇక అదే ఊళ్ళో యాది( తిరువీర్) పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక దామినిని చూసిన యాది ప్రేమలో పడి ఇంట్లోవారిని ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు. దామిని తండ్రి.. తన కూతురుకు ఉన్న సమస్య గురించి చెప్తే పెళ్ళి చేసుకోడేమో అని ఆ విషయాన్నీ యాది దగ్గర దాచి పెళ్ళి చేస్తాడు. ఆ తరువాత దామిని సమస్య తెలుసుకున్న యాది ఏం చేశాడు.. ? అసలు దామినికి ఆ సమస్య ఎప్పటినుంచి ఉంది.. ? ఈ సమస్య వలన యాది- దామిని మధ్య జరిగిన పరిణామాలు ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఇక తిరువీర్ నటించిన గత చిత్రం పాపం ప్రతాప్ లో కూడా పెళ్ళి తరువాత ఒక సమస్య.. దానివలన పడిన ఇబ్బందులు చూపించారు. ఇప్పుడు ఓ సుకుమారిలో మరో సమస్యను పెట్టారు. అయితే ఇందులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉండబోతున్నాయని టాక్. మగధీరలో హీరోహీరోయిన్లు ముట్టుకుంటే షాక్ కొట్టినట్లు చూపించారు. కానీ, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరిని ముట్టుకున్నా షాక్ కొడుతోంది. ఇది కొత్త కాన్సెప్ట్ లానే అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో తిరువీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Hit & Run: రిపోర్టర్ పాత్రలో నటాషా సింగ్‌!

దృఢం లేడి విలన్.. యమా హాట్ గురూ..

సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'.. ఓటీటీకి వచ్చేస్తోంది

Updated Date - Jun 14 , 2026 | 08:23 AM