Hit & Run: రిపోర్టర్ పాత్రలో నటాషా సింగ్!
ABN , Publish Date - Jun 13 , 2026 | 02:55 PM
ఉత్తరాది మోడల్ నటాషా సింగ్ బ్యాక్ టు బ్యాక్ రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అందులో ఒకటి 'హిట్ అండ్ రన్' కాగా, మరొకటి సుడిగాలి సుధీర్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'హైలెస్సో'!
సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రాబోతున్న ఈ సినిమాను సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంజయ్ రావ్ పాత్ర, ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ‘హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. నటాషా సింగ్ ఈ సినిమాలో రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో కనిపిస్తున్న కారు, వెనకాల ఉన్న డీటైల్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ ‘హిట్ అండ్ రన్’ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఇప్పటికే మోడల్‌గా రాణిస్తూ, పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న నటాషా సింగ్ తెలుగులో 'హైలెస్సో' మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నటాషాతో పాటు నక్ష శరణ్ హీరోయిన్ నటిస్తోంది. అలానే అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తోంది. 'హైలెస్సో' మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. 'హిట్ అండ్ రన్, హైలెస్సో' చిత్రాలతో నటాషా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది
Lenin: మళ్ళీ అయ్యగారి సినిమా వాయిదా.. ?
షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో