సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుజీత్ వాళ్ళను ఆపు.. అవేం ఎడిట్స్ రా బాబు.. మెంటలొచ్చేస్తుంది

ABN, Publish Date - Jun 26 , 2026 | 06:58 PM

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని అందరూ ఏ రేంజ్ లో ఉపయోగిస్తున్నారో అందరికీ తెల్సిందే. కొందరు చెడుకి ఉపయోగిస్తుంటే.. మరికొందరు మంచికి ఉపయోగిస్తున్నారు.

OG 2

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని అందరూ ఏ రేంజ్ లో ఉపయోగిస్తున్నారో అందరికీ తెల్సిందే. కొందరు చెడుకి ఉపయోగిస్తుంటే.. మరికొందరు మంచికి ఉపయోగిస్తున్నారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోల సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. స్టార్ హీరో కొత్త సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ వస్తే చాలు దాంతో కథ మొత్తాన్ని ఏఐతో అల్లేసి దర్శకులకే దడ పుట్టిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) - సుజీత్ (Sujeeth) కాంబోలో వస్తోన్న ఓజీ2 (OG2) కి సంబంధించిన ఒక అప్డేట్ ఇలా వచ్చిందో లేదో.. సోషల్ మీడియా అంతా ఏఐ ఎడిట్స్ తో పిచ్చెక్కించారు.


పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఓజీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. పవర్ స్టార్ స్వాగ్, సుజీత్ డైరెక్షన్, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాయి. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అభిమానుల ఉత్సాహాన్ని అమాంతం పెంచుతూ, మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఓజీ పార్ట్ 2 ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తూ, ప్రీ-ప్రొడక్షన్ పనులు లాంఛనంగా ప్రారంభమైనట్లు ఒక స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన అతిపెద్ద సర్ప్రైజ్ ఇంకొకటి ఉంది. ఓజీ 2 లో కేవలం యాక్షన్, ఎమోషన్స్ మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కు అనుబంధంగా పెంపుడు జంతువుగా డ్రాగన్ కూడా ఉండబోతోందని సుజీత్ చెప్పుకొచ్చాడు. ఈ వార్త బయటకు రాగానే ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


సుజీత్ రైటింగ్ స్టైల్‌ను బట్టి చూస్తే, ఈ పెట్ క్యారెక్టర్ కేవలం వినోదం కోసం కాకుండా కథను మలుపు తిప్పే కీలకమైన అంశంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఒక్క అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. గంభీర పెట్ డ్రాగన్ తో పవన్ ఫ్యాన్స్ ఎడిట్స్ మొదలుపెట్టారు. అసలు ఒక్కో ఎడిట్ ఒక్కో డైమండ్ అని చెప్పాలి. అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ సినిమాలో ఉన్నట్లే డ్రాగన్ తో పవన్ కనిపించారు. ప్రస్తుతం ఈ ఎడిట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఎడిట్స్ చూసినవారు సుజీత్ వాళ్ళని ఆపు అని సరదాగా కామెంట్స్ చేస్తుంటే.. ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికారురా.. ఆపండ్రా బాబు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఎడిట్స్ కి తగ్గట్లు సుజీత్.. సినిమాలో చూపిస్తాడా.. ? లేక ఈ ఎడిట్లే బావుంటాయా అనేది చూడాలంటే ఓజీ 2 రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Updated Date - Jun 26 , 2026 | 07:48 PM