సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

క్రేజీ కళ్యాణం ట్రైలర్.. భలే క్రేజీగా ఉందే

ABN, Publish Date - Oct 11 , 2026 | 08:28 PM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం.

Crazy Kalyanam

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం. భద్రప్ప గజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.


నరేష్ కి ఇద్దరు కూతుళ్లు.. పెద్ద అల్లుడు తరుణ్ భాస్కర్. ఇల్లరికం వచ్చి ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. దీంతో నరేష్ కి ఊళ్ళో పరువు పోతుంది. అందుకని చిన్న కూతురు అనుపమకి పెళ్లి చేసి మంచి అల్లుడిని తెచ్చుకొని ఊళ్ళో గౌరవం పొందాలని అనుకుంటాడు. ఇక అనుపమ.. కాలేజ్ లో తనతో పాటు చదివే అఖిల్ రాజ్ ని ప్రేమిస్తుంది. అమెరికా సంబంధం అని నరేష్ తీసుకొచ్చిన పెళ్లిని చెడగొట్టి అఖిల్ ని పెళ్లి చేసుకోవడానికి అనుపమ ఏం చేసింది.. ? దానికి అక్క బావ ఎలా సపోర్ట్ చేశారు.. ? చివరికి తోడల్లుళ్ళు .. మామని ఎలా ఇబ్బందిపెట్టారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


క్రేజీ కళ్యాణం.. టైటిల్ కి తగ్గట్టే సినిమా మొత్తం క్రేజీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అకట్టుకోగా, తరుణ్ భాస్కర్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో స్క్రీన్‌పై అదరగొట్టారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలమయ్యారు. లవ్, కామెడీ,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ క్రేజీ కళ్యాణం.. రణబాలికి పోటీగా వస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Updated Date - Oct 11 , 2026 | 08:28 PM