‘న్యాయం చేయరా దేవుడా’ అంటూ.. శ్రష్టి వర్మ డ్యాన్స్‌తో దుమ్మురేపింది
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:08 PM
మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ సినిమా నుంచి శ్రష్టి వర్మ స్పెషల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో, మేరుం భాస్కర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘న్యాయం చేయరా దేవుడా’ (Nyayam Cheyara Devudaa) థియేట్రికల్ ఎక్స్‌టెండెడ్ వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించగా.. ఆయన చేతుల మీదుగానే విడుదలైన ఈ పాటకు శ్రష్టి వర్మ డ్యాన్స్ చేయడంతో పాటు, స్వయంగా కొరియోగ్రఫీ చేయడం విశేషం. స్టార్ సింగర్ సునీత ఉపద్రష్ట తన మధురమైన, హుషారైన గాత్రంతో ఆలపించగా, మహావీర్ యేలేందర్ అదిరిపోయే మాస్ బీట్‌ను సమకూర్చారు.
ఈ ప్రత్యేక గీతంలో శ్రష్టి వర్మ తన అందచందాలు, అదిరిపోయే స్టెప్పులతో యూత్‌ను ఉర్రూతలూగించింది. ‘మైసూరు ప్యాలెస్‌లోన ఉండాల్సిందాన్ని.. మామూలు ఇంటిలోన ఉంటున్నాను.. రోల్స్ రాయిస్ కార్లోన ఎక్కాల్సిందాన్ని.. రోడ్డు సైడు ఆటోలోన పోతున్నాను.. న్యాయం చేయరా దేవుడా నాలోని అందాలకు’ అంటూ సాగే సాహిత్యంలో తనదైన నాటీ ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో స్టేజ్‌పై దుమ్మురేపింది. శ్రష్టి గ్లామర్ ప్రెజెన్స్, మాస్ బీట్‌కు తగ్గట్టుగా వేసిన ఫాస్ట్ స్టెప్పులు, గ్రేస్ మూమెంట్స్ వీడియో మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.

వారాహి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ వీడియో సాంగ్ లాంచ్ కార్యక్రమంలో చంద్రబోస్‌తో పాటు ఆయన తనయుడు నంద వనమాలి, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు. కథాంశానికి తగినట్లుగా ఎంతో వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన ఈ మాస్ నంబర్ అన్ని వర్గాల శ్రోతలను, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బీజేపీపై సంచలన ఆరోపణలు.. విజయ్ ‘టీవీకే’లోకి నటుడు దేవన్
Varanasi: 50 భాషల్లో.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉండాల్సిందే
కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్