సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dil Raju: ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’కి కొనసాగింపా.. కొత్త కథనా?

ABN, Publish Date - Apr 20 , 2026 | 09:21 AM

‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’కి కొనసాగింపా.. కొత్త కథనా? ‘మా ఊళ్లో చిన్న ఇల్లు.. పది ఎకరాల పొలం.. నాలుగు ఎద్దులు.. పాతిక కోళ్లు.. వీటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు’ అదే నాకు కోట్ల ఆస్తి.. అంటూ

‘మా ఊళ్లో చిన్న ఇల్లు..

పది ఎకరాల పొలం..

నాలుగు ఎద్దులు..

పాతిక కోళ్లు..

వీటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు’

అదే నాకు కోట్ల ఆస్తి.. అంటూ

‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) చిత్రంలో త్రిష చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ ఇది. ఇలాంటి ఎన్నో డైలాగ్‌లతో ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. సిద్దార్థ్‌(Siddharth), త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఎమ్మెస్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. 2005 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కాంబినేషన్‌ రిపీట్‌ కానుందనేది ఆ సారాంశం. సిద్ధార్థ్‌, త్రిష హీరోహీరోయిన్లుగా ఓ నూతన దర్శకుడితో ఈ చిత్రం రూపొందనుందని, దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్‌ నడుస్తోంది. అయితే ఇది ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికి సీక్వెల్‌గానా, లేక అదే కాంబినేషన్‌తో మరో కొత్త చిత్రామా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దిల్‌ రాజు సంస్థ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహితుల ద్వారా తెలిసింది.

Updated Date - Apr 20 , 2026 | 10:23 AM