సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: తారక్‌ నాలుగు సినిమాలు.. లైనప్‌ మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Jun 30 , 2026 | 12:03 PM

   తారక్‌ నాలుగు సినిమాలు.. లైనప్‌ మామూలుగా లేదుగా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

N T R

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Ntr) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డ్రాగన్‌’తో (Dragon) బిజీగా ఉన్నారు. దీనికి కొనసాగింపుగా డ్రాగన్‌2 కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’కు కూడా సీక్వెల్‌ ప్రకటించారు. ఆ చిత్రం ఎప్పుడైనా సెట్స్‌ మీదకెళ్లొచ్చు. ఇవి కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించి ఉంది హారిక అండ్‌ హాసిని బ్యానర్‌. దీనికి సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇలా చూస్తే తారక్‌ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. దీంతో తారక్‌ లైనప్‌ అదిరింది అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే ఇవన్నీస్క్రీన్ మీదకు రావడానికి ఎంతకాలం పడుతుందనేది చూడాలి.

‘డ్రాగన్‌’తో షురూ కానున్న మాస్‌ జాతర

ప్రస్తుతం ఎన్టీఆర్‌, స్టార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’ చిత్రంపై దృష్టి పెట్టారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కెజీఎఫ్‌, సలార్‌ వంటి పాన్‌ ఇండియా చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.   ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త మాస్‌ అవతార్‌లో చూపించనున్నారు నీల్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది  జూన్‌ 11న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాటల మాంత్రికుడితో మరోసారి..

ప్రశాంత్‌ నీల్‌ ‘డ్రాగన్‌’ తర్వాత.. మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమాకు శ్రీకారం చుట్టుబోతున్నారు తారక్‌. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమిది. ఈ సినిమా ప్రకటించి చాలాకాలమే అయినా ఇప్పుడు ట్రాక్‌లోకి వచ్చింది. ‘శివుడి కుమారుడు.. పార్వతి గర్వం.. శాశ్వత సేనాపతి’ అంటూ యుద్ధ దేవుడిగా కీర్తిగాంచిన కార్తికేయుడి సినిమాను సోమవారం అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలో షూటింగ్‌ షెడ్యూల్‌ వివరాలు ప్రకటిస్తారు.

నీల్‌తో కూడా సీక్వెల్‌..
ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్‌’ చిత్రానికి కూడా సీక్వెల్‌ ఉందని టాక్‌ నడుస్తోంది. అధికారిక ప్రకటన లేదు కానీ.. వార్త అయితే వైరల్‌ అవుతోంది. మొదటి భాగం వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది. ఈ మధ్యలో డ్రాగన్‌ చిత్రీకరణ పూర్తయితే తారక్‌ త్రివిక్రమ్‌ సినిమాను ట్రాక్‌లోకి తెచ్చే అవకాశం ఉంది. దీనికో ఏడాది సమయం పట్టొచ్చు. దీనితోపాటు ‘దేవర-2’ కూడా లైన్‌లో ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది తెలియదు. ఇది ముందు వెనుక అయితే మళ్లీ డ్రాగన్‌-2 లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లైనప్‌ మొత్తం చూస్తే మరో మూడేళ్లు తారక్‌ డేట్స్‌ పేకప్‌ అయినట్లే కనిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అభిమానులకు రానున్న మూడేళ్లు తారక్‌ సినిమాలతో పండగే! 

ALSO READ: Bandla Ganesh: మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

Ramayana: రామాయణ ట్రైలర్.. ప్రత్యేకత అదే

Director Samudra: డబ్బు వసూలు చేసినా.. పేరు వాడినా.. ఊరుకోను




Updated Date - Jun 30 , 2026 | 12:43 PM