సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: మారాయ్‌.. అన్నీ మారాయ్‌.. ఫాస్ట్‌గా అడ్రస్‌ పెట్టు..

ABN, Publish Date - Jun 06 , 2026 | 01:19 PM

యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీలోనే కాదు... వంటింట్లో గరిట తిప్పడంలోనూ దిట్ట యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. తారక్‌ చేసిన బిర్యానీ, నాటు కోడి ఇరుగుకు పెద్ద ఫ్యాన్‌ బేస్‌ ఉంది.


యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీలోనే కాదు.. వంటింట్లో గరిట తిప్పడంలోనూ దిట్ట యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR). తారక్‌ చేసిన బిర్యానీ, నాటు కోడి ఇరుగుకు పెద్ద ఫ్యాన్‌ బేస్‌ ఉంది. చాలా కాలం తర్వాత వంటలకు సంబంధించిన ఆయన చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! శుక్రవారం ఆయన కుకీస్‌ తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసి ‘ఇవి కొన్నవి కాదు.. నేనే బేక్‌ చేశా. మొదటిసారి’ అని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ వైరల్‌ అయింది. (Tarak bakes cookies)

ఆ పోస్ట్‌ చూసిన సాయి తేజ అనే అభిమాని ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్‌ పంపించు అన్నా’ అని ఎక్స్‌ వేదికగా కోరారు. తారక్‌ వెంటనే స్పందించారు. ‘కింగ్‌’లో బ్రహ్మానందం వీడియోను పంచుకుంటూ ‘అడ్రస్‌ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్‌ పెట్టు’ అంటూ ఆడియోతో ఉన్న ఆ వీడియోతో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్‌ నుంచి  సమాధానం రాగానే సాయితేజ మాత్రమే కాదు, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు. ‘అన్నా జన్మ ధన్యమైంది. కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’ అంటూ సాయితేజ తన అపార్ట్‌మెంట్‌ అడ్రస్‌ను షేర్‌ చేశారు. మరో అభిమాని అదే వీడియోను ట్యాగ్‌ చేసి ‘బిర్యానీ, నాటుకోడిఎక్కడ.. టైగర్‌.. ఏంటీ కుకీలు..’ అని ఎన్టీఆర్‌ను అడగ్గా, ‘మారాయ్‌.. అన్నీ మారాయ్‌’ అంటూ ‘బాద్‌షా’లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ వీడియోను షేర్‌ చేశాఉ. అసలు సోషల్‌ మీడియాలో ఇలా ఎప్పుడూ లేని తారక్‌ ఒక్కసారిగా వరుస పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. 

Updated Date - Jun 06 , 2026 | 01:38 PM