సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: ‘డ్రాగన్‌’ ఇంటర్వెల్‌ ఫైట్‌.. ఎన్టీఆర్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ భారీ ప్లాన్‌!

ABN, Publish Date - Sep 13 , 2026 | 12:52 PM

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’ సినిమాకు సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రాగన్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘డ్రాగన్‌’ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్‌ ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సెట్‌లో సుమారు రెండు వారాల పాటు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు,  ముఖ్యంగా ఎన్టీఆర్‌పై కీలకమైన ఫైట్స్‌ను ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్‌ నేతృత్వంలో తెరకెక్కించనున్నట్లు  చిత్ర బృందం నుంచి సమాచారం. అక్టోబర్  చివరి వారంలో ఈ  సెట్‌లో షూటింగ్‌ ప్రారంభించే అవకాశముందట. ఇటీవల ఎన్టీఆర్‌  గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తవడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ‘డ్రాగన్‌’ షూటింగ్‌లో తిరిగి పాల్గొంటారు. 


మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాల్లో కనిపించిన డార్క్‌, గ్రే టోన్‌ విజువల్స్‌కు భిన్నంగా ‘డ్రాగన్‌’లో ఓ సరికొత్త విజువల్‌ ట్రీట్‌ ఉండబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ పూర్తిగా కలర్‌ఫుల్‌గా, వైబ్రెంట్‌ విజువల్స్‌తో ఉంటుందట. ఇంటర్వెల్‌ వద్ద వచ్చే భారీ యాక్షన్‌ బ్లాక్‌, ఎన్టీఆర్‌ యాక్షన్‌ మాస్‌ ఇమేజ్‌, ప్రశాంత్‌ నీల్‌ మార్క్‌ టేకింగ్‌తో ‘డ్రాగన్‌’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.  

Updated Date - Sep 13 , 2026 | 01:14 PM