సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హిందీ బెల్ట్‌లో.. ఎన్టీఆర్ డ్రాగ‌న్‌ మాస్ రాంపేజ్‌! నార్త్‌లో ఊహించని రెస్పాన్స్‌

ABN, Publish Date - May 29 , 2026 | 11:11 AM

పాన్ ఇండియా మార్కెట్‌ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది.

dragon

బాహుబలి సృష్టించిన సంచలనంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప, సలార్, కల్కి వంటి చిత్రాలు టాలీవుడ్ సత్తాను నార్త్ ఇండియాకు కూడా రుచి చూపించాయి. పాన్ ఇండియా మార్కెట్‌ను మన హీరోలు, దర్శకులు ఏ విధంగా కొల్లగొడుతున్నారో లోకమంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే బాటలో, అంతకుమించిన భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోంది ఒక క్రేజీ కాంబినేషన్. అదే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr ntr) , హై-వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (prashanth neel) కలయికలో వస్తున్న డ్రాగన్ (Dragon).

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన ఊపు కనిపిస్తోంది. అసలు టైటిల్ ఏం పెడతారు..? టీజర్ ఎలా ఉండబోతోంది? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. దానికి తగ్గట్టే రీసెంట్‌గా విడుదలైన డ్రాగన్ టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ అభిమానుల అంచనాలను వంద శాతం రీచ్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే.. థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తారక్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా ఇక్కడ ఎలాగూ భారీ హైప్ క్రియేట్ అయింది. నార్త్ బెల్ట్‌లో డ్రాగన్‌ సినిమాకు వస్తున్న ప్రభంజనం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లో డ్రాగన్ చిత్రంపై ఒక రేంజ్‌లో బజ్ నడుస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

గత రెండు రోజులుగా యూట్యూబ్‌లో ఈ చిత్ర హిందీ టీజర్‌కు వస్తున్న వ్యూస్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్ల బెడుతున్నాయి. మే 19న ఈ టీజర్ అన్ని భాషల్లో విడుదల కాగా, అన్ని భాషల్లోనూ ఈ టీజర్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. అయితే హిందీలో మొన్నటి వరకు 3 కోట్ల వ్యూస్‌ రాగా, అది ఇప్పుడు 4 కోట్లు దాటడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా ట్రైలర్‌ రిలీజ్‌ అయిన రెండు రోజుల వరకే దాని హవా నడుస్తుంది. ఆ తరువాత రిలీజ్‌ దగ్గర పడుతున్న సమయంలో దానికి హైప్‌ వస్తుంది. కానీ డ్రాగన్‌ హిందీ ట్రైలర్‌కు నార్త్‌ బెల్ట్‌లో ఈ రేంజ్‌ మార్కెట్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదట. ఆర్ఆర్ఆర్ సినిమాతో హిందీ బెల్ట్‌కు బాగా దగ్గరైన తారక్, ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అక్కడ తిరుగులేని రికార్డులు సృష్టించడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు.

కేజీఎఫ్, సలార్ చిత్రాలతో యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తారక్ నటనలోని తీవ్రత, నీల్ స్క్రీన్ ప్లే తోడైతే బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది విడుదల కాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌లో డ్రాగన్ టాప్‌లో నిలిచింది. నార్త్ ఆడియన్స్‌కు కావలసిన పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టీజర్ హింట్ ఇచ్చేసింది. ఏదేమైనా, వచ్చే ఏడాది వెండితెరపై ఎన్టీఆర్ సృష్టించబోయే విద్వంసాన్ని కళ్లారా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - May 29 , 2026 | 02:00 PM