ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!
ABN, Publish Date - Jun 29 , 2026 | 05:22 PM
టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రం రాబోతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి క్లాసిక్ మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో చిత్రం (#NTRxTrivikram) కావడంతో.. అప్పుడే ఈ సినిమాపై ఆకాశమే అవధి అనేలా అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన వారంతా చెప్పే మాట ఒక్కటే.. ‘అదిరిపోయింది’.
వాస్తవానికి ఈ సినిమా మొదట అల్లు అర్జున్‌తో అనుకున్న విషయం తెలిసిందే. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఎన్టీఆర్‌తో ఫైనల్ అయింది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే.. ఒక భారీ యుద్ధ భూమి బ్యాక్‌డ్రాప్‌లో, ఆకాశం వైపు చూపిస్తున్న డిఎన్ఏ ఆకృతి కలిగిన త్రిశూలం.. దాని చుట్టూ ఉన్న సంస్కృత శ్లోకం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ‘ONE SPEAR ONE PURPOSE ONE DIVINE RECKONING’ అంటూ పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్ సినిమాలోని దైవిక, పౌరాణిక, చారిత్రాత్మక కోణాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్వీట్ చేస్తూ సినిమా కథాంశంపై హింట్ ఇచ్చారు. ‘‘శివుని కుమారుడు.. పార్వతికి గర్వకారణం.. శాశ్వత సైన్యాధ్యక్షుడు (కుమారస్వామి/కార్తికేయ బ్యాక్‌డ్రాప్).. మరోసారి త్రివిక్రమ్‌తో...’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో చెప్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఉత్తరాదిన జన్మించి.. దేశ హృదయభూమిలో రాటుదేలి.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు.. విశ్వవ్యాప్తం కావడానికి సిద్ధమైన ఒక అద్భుత గాథ!’ అంటూ సినిమా పాన్-వరల్డ్ స్థాయిలో ఉండబోతోందని హింట్ ఇచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, అలాగే త్రివిక్రమ్-అనిరుధ్ మార్క్ ఆల్బమ్ గతంలో సంచలనాలు సృష్టించడంతో ఈ చిత్ర ఆడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఫైనల్‌గా ఈ పోస్టర్ చూస్తుంటే.. త్రివిక్రమ్ ఈసారి సరికొత్త జోనర్‌లో ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని ఒక డివైన్ మాస్ అవతారంలో చూపించబోతున్నట్లుగా అయితే అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!
‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!
పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ