ఆదర్శ కుటుంబం లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్
ABN, Publish Date - Sep 07 , 2026 | 09:19 PM
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకు ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆదర్శ కుటుంబం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై సోషల్ మీడియాలో ఒక పిచ్చెక్కిచే వార్త విపరీతంగా ప్రచారమవుతోంది.
ఈ చిత్రంలో కీలక పాత్రల పరిచయంతో పాటు, కథలో ఎంతో కీలకమైన వెంకటేశ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇక ఈ మధ్యనే తారక్ .. లెనిన్ మూవీకి తన గంభీరమైన గొంతును అరువు ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ కోసం ఆదర్శ కుటుంబం సినిమాకు తన గాత్రాన్ని అందించనున్నాడని టాక్ నడుస్తోంది.వెంకీ యాక్టింగ్ , గురూజీ డైలాగ్స్ కి ఎన్టీఆర్ వాయిస్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నందమూరి, దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజీ కలయికపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి త్రివిక్రమ్.. గాడ్ ఆఫ్ వార్ లోకి దిగనున్నాడు. అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఈ సినిమాలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు గురూజీ.. ఇటు తారక్ తమ రెండు సినిమాలను పూర్తిచేసి గాడ్ ఆఫ్ వార్ లో అడుగుపెట్టనున్నారు. మరి ఈ సినిమాతో వీరిద్దరూ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.