NTR: తారక్ వస్తున్నాడంటే వైబ్స్ మామూలుగా ఉండవు..
ABN, Publish Date - Sep 29 , 2026 | 10:11 AM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' సినిమాతో బిజీ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ఇది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం 'డ్రాగన్' సినిమాతో బిజీ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తారక్ అభిమానులతో కలిసింది లేదు. వరుస షూటింగ్స్ పై ఫోకస్ పెట్టడం వల్ల ఫ్యాన్స్‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. పైగా చేతికి గాయం కావడం, సర్జరీ జరగడంతో తారక్ కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో తారక్‌ను నేరుగా చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎస్.ఎస్. రాజమౌళి ఓ స్పెషల్ మూమెంట్‌ను తీసుకొచ్చారు. రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమా ఈవెంట్ కు తారక్ ను అతిథిగా ఆహ్వానించారు. ప్రస్తుతం కోలుకున్న ఆయన మంగళవారం హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరుకానున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో ఈవెంట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేదికపై తారక్ ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తారక్ స్పీచ్‌కు ఫ్యాన్స్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం, సహ నటీనటులు, దర్శకుల గురించి చెప్పే మాటలు, తన అభిమానులతో పంచుకునే భావోద్వేగాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఈసారి మాత్రం వేదిక మరింత ప్రత్యేకం. ఒకవైపు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ సినిమా.. మరోవైపు తన సినీ ప్రయాణంలో ఎంతో కీలకమైన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. జక్కన్నతో తారక్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ నెం.1’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో వీరి కాంబినేషన్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. వీరిద్దరూ కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంటుంది. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి తారక్ ఏం చెబుతారనే దానికంటే.. ఫహాద్ గురించి, రాజమౌళి గురించి ఆయన ఎలాంటి మాటలు చెబుతారనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు రాబోతున్న తారక్ స్పీచ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశముంది. ఈ సినిమా దక్షిణాది భాషల్లో అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.