సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

God of war: ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'.. షూటింగ్ ఎప్పుడంటే?

ABN, Publish Date - Sep 27 , 2026 | 02:33 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. గత కొన్ని వారాలుగా గాయం కారణంగా ఇంటికే పరిమితమైన తారక్, ఎట్టకేలకు మళ్లీ పబ్లిక్ ఈవెంట్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) అభిమానులకు ఒక గుడ్ న్యూస్. గత కొన్ని వారాలుగా గాయం కారణంగా ఇంటికే పరిమితమైన తారక్, ఎట్టకేలకు మళ్లీ పబ్లిక్ ఈవెంట్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సర్జరీ జరగడం, వైద్యుల సలహా మేరకు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో తారక్ ఎక్కడా బయట కనిపించకపోవడంతో అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి, రీ-ఎంట్రీ గురించి ఆత్రుతగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది.

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న యంగ్ టైగర్, త్వరలోనే ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా, ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా వర్క్స్' భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సెప్టెంబర్ 29న ఈ ఈవెంట్ జరగనుంది. గాయం తర్వాత తారక్ మొదటిసారి మైక్ పట్టుకోనుండటంతో, ఆయన ఇచ్చే స్పీచ్, చూపించే ఎనర్జీ ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాపై కూడా సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డబ్బు, వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే ఒక సాధారణ వ్యక్తి జీవితంలోకి ఓ చిన్న పాప ప్రవేశించిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అనే ఒక ఎమోషనల్ అండ్ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం, దానికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానుండటంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ హైప్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ గురించిన తాజా అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్, తారక్ లేకుండానే ఇన్ని రోజులు శరవేగంగా జరిగింది. ఎన్టీఆర్ గాయపడినప్పటికీ, సమయం వృథా కాకుండా ఆయన లేని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ మళ్లీ 'డ్రాగన్' షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారట. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్టులో అనిల్ కపూర్, బీజు మీనన్, అశుతోష్ రాణా వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తొలిసారిగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 29న తారక్ చెప్పబోయే మాటలు, 'డ్రాగన్' మూవీ గురించి ఇచ్చే అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 27 , 2026 | 02:44 PM