సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రికార్డులను తిరగరాయాలనే పట్టుదలతో తారక్

ABN, Publish Date - Apr 07 , 2026 | 09:33 AM

ఎన్టీఆర్ (NTR) కెరీర్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపులో ఉంది. త్రిబుల్ ఆర్ వంటి భారీ విజయం తర్వాత తారక్ నుండి వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి పర్ఫెక్ట్ సక్సెస్‌ను అందుకుంది.

ఎన్టీఆర్ (NTR) కెరీర్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపులో ఉంది. త్రిబుల్ ఆర్ వంటి భారీ విజయం తర్వాత తారక్ నుండి వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి పర్ఫెక్ట్ సక్సెస్‌ను అందుకుంది. అయితే, భారీ అంచనాల మధ్య బాలీవుడ్‌లో చేసిన వార్-2 (War 2) మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు నందమూరి అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ (Dragon) సినిమాపైనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ చేస్తున్న సాహసాలు చూస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ సునామీ ఖాయమనిపిస్తోంది.



ఒక విజయం, ఒక అపజయం తర్వాత హీరోలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయడం సహజంగా జరిగేదే. వార్-2 ఫలితంతో సంబంధం లేకుండా, తన తదుపరి చిత్రం డ్రాగన్ కోసం ఎన్టీఆర్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లకు తోడు తారక్ నటన తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాను కేవలం హిట్ అనిపించుకోవడమే కాకుండా, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయాలనే పట్టుదలతో తారక్ ఉన్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే దాదాపు 15 కేజీలకు పైగా బరువు తగ్గారు. తన బాడీని పూర్తిగా సన్నగా మార్చేసి, మునుపెన్నడూ చూడని లుక్‌లో షాక్ ఇచ్చారు. ఆ స్లిమ్ లుక్ చూసి అభిమానులు ఆందోళన పడేంతగా ఆయన కష్టపడ్డారు. కేవలం రూపం మార్చడమే కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లలో పర్ఫెక్షన్ కోసం వేల ఏళ్ల నాటి యుద్ధ విద్య కళరిపయట్టును నేర్చుకుంటున్నారు. దీని కోసం కేరళలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారట. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్లలో ఈ యుద్ధ విద్య హైలైట్‌గా నిలవనుంది.



ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్‌కు మెంటర్‌గా ఆయన పాత్ర సినిమాకు పెద్ద అసెట్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం, రుక్మిణి వసంత్ గ్లామర్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల కంటే ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. వార్-2 డిజాస్టర్ టాక్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నిరాశలో ఉన్న మాట వాస్తవమే. కానీ డ్రాగన్ అప్‌డేట్స్ చూస్తుంటే ఆ నిరాశ కాస్తా భారీ అంచనాలుగా మారిపోయింది. మరి ఈ సినిమాతో తారక్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..? ప్రశాంత్ నీల్ చూపించబోయే ఆ కొత్త ప్రపంచం ఎలా ఉండబోతోంది..? అనేది చూడాలి.

Updated Date - Apr 07 , 2026 | 11:06 AM