సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ntr-Neel: ఎన్టీఆర్‌-నీల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. బర్త్‌డేకు మరో ట్రీట్‌..

ABN, Publish Date - Apr 21 , 2026 | 10:57 AM

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ఎన్టీఆర్‌తోపాటు మేకర్స్‌ ప్రకటించారు. ‘తుపాను తన లక్ష్యాన్ని కనుగొంది. 2027 జూన్‌ 11న థియేటర్‌లలో తుపాను రావడం ఖాయం’ అంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అంతే కాదు.. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ ట్రీట్‌ ఇవ్వనున్నారు. మే 20న ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ జూన్‌ 25కు వాయిదా వేశారు. భారీ స్పాన్  ఉన్న సినిమా కావడం, షూటింగ్ కి ఇంకా సమయం కావాల్సి రావడం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మిగిలి ఉండడంతో మరోసారి సినిమా వాయిదా పడింది.  

రుక్మిణి వసంత్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Updated Date - Apr 21 , 2026 | 12:53 PM