సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యన్టీఆర్ - నీల్ సినిమా 'డ్రాగన్' కాదా?

ABN, Publish Date - Feb 23 , 2026 | 08:32 AM

యంగ్ టైగర్ యన్టీఆర్‌తో డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాకు మొదటి నుంచీ 'డ్రాగన్' అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ పేరుకు బదులుగా ఓ ఫ్లాప్ మూవీ టైటిల్ పెట్టబోతున్నారని టాక్.

Ntr Dragon

యన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలసి యన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. అయితే మొదటి నుంచీ ఈ సినిమాకు డ్రాగన్ (Dragon) అనే పేరు విశేషంగా వినిపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య తమిళ డబ్బింగ్ మూవీకి 'డ్రాగన్' ఒరిజినల్ టైటిల్ అయినా, తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' గానే రిలీజ్ చేశారు. ఇది చూసిన జనం యన్టీఆర్ - నీల్ మూవీ టైటిల్ 'డ్రాగన్' అనే ఫిక్సయ్యారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ స్థానంలో మరో పేరు విశేషంగా వినిపిస్తోంది. పైగా ఆ టైటిల్ రామ్ చరణ్ ఫ్లాప్ మూవీ పేరు కావడం మరింత విశేషంగా మారింది. ఇంతకూ ఆ టైటిల్ ఏంటంటే బ్రూస్లీ (Bruce Lee)!

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'బ్రూస్లీ' చిత్రం 2015లో విడుదలయింది... ఈ మూవీలో చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ 'బ్రూస్లీ' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మరి అలాంటి టైటిల్ ను ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ మూవీ కోసం ఉపయోగించాలని భావించడం వింతగానే ఉంది.

'ఎంటర్ ద డ్రాగన్', 'గేమ్ ఆఫ్ డెత్' వంటి చిత్రాలతో యాక్షన్ హీరో బ్రూస్లీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం యన్టీఆర్ తో నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో కూడా కథానుగుణంగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ కథ చైనా బార్డర్ లో జరిగే ఇతివృత్తంతో రూపొందుతోందట. ఈ కారణాల వల్ల 'బ్రూస్లీ' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పైగా ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తూనే, ఇంటర్నేషనల్ మార్కెట్ పైనా గురిపెట్టారు. ఆ కోణంలోనూ 'బ్రూస్లీ' అన్న టైటిలే ఈ చిత్రానికి సబబైనదని టాక్.

యన్టీఆర్ - నీల్ మూవీలో అనిల్ కపూర్, టోవినో థామస్ కీలక పాత్రలు ధరిస్తున్నారు. రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు నీల్. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఓ వైపు యన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే, తనదైన పంథాలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ యేడాది జూన్ 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి సినీ ఫ్యాన్స్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ఈ సినిమా ఏ టైటిల్ తో జనం ముందు నిలుస్తుందో చూడాలి.

Updated Date - Feb 23 , 2026 | 08:42 AM