సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. క్లైమాక్స్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!

ABN, Publish Date - Nov 09 , 2026 | 04:09 PM

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

NTR Dragon

ఇండియన్ సినిమా దగ్గర ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలు ఉన్న కాంబినేషన్లలో ఒకటి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ (Dragon). తొలిసారిగా తారక్ - నీల్ జతకడుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ కూడా ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుంటే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బూ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరవబోతున్నారు.

అయితే, ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. డ్రాగన్ సినిమా అప్‌డేట్స్ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బయటకొచ్చిన తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం కానుందట. దీనికోసం ఒక భారీ, అత్యంత ప్రత్యేకమైన సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్లైమాక్స్ కోసం ఎన్టీఆర్‌పై కళ్లు చెదిరే రేంజ్‌లో కొన్ని స్పెషల్ యాక్షన్ సీక్వెన్సులను నీల్ ప్లాన్ చేశారట. తారక్ మాత్రమే కాకుండా సినిమాలో నటించే ఇతర కీలక నటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ పూర్తి కాగానే.. వెంటనే ఒక కలర్‌ఫుల్ సాంగ్ షూటింగ్ కూడా ప్లాన్ చేశారట మేకర్స్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ప్రశాంత్ నీల్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రవి బస్రూర్ అందించే ఎలివేషన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. నీల్ సినిమాలకు రవి బస్రూర్ ఇచ్చే ఆర్ఆర్, మ్యూజిక్ ఎలాంటి సీన్‌నైనా నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తాయి. డ్రాగన్‌కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. కానీ, ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ బయటకొచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రవి బస్రూర్‌తో పాటు 'ధురంధర్' ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపుతున్నారట. ఈ ఇద్దరు దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే సినిమాకి కలిసి వర్క్ చేస్తే.. థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం ఫుల్ కలర్‌ఫుల్‌గా, విజువల్ గ్రాండియర్‌తో ఉండబోతున్నాయట దర్శకుడు. నీల్ మేకింగ్‌లో ఈ మార్పు తారక్ అభిమానులకు, అలాగే సగటు సినిమా ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వబోతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ న్యూస్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం డిసెంబర్ షూట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానున్న ఈ 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఎలాంటి రికార్డుల మోత మోగిస్తుందో చూడాలి.

Updated Date - Nov 09 , 2026 | 04:10 PM