చిరంజీవికి.. కమల్‌హాసన్.. జయసుధతోపాటు పలువురికి విశిష్ఠ పురస్కారాలు..
ABN, Publish Date - Mar 07 , 2026 | 12:56 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) శనివారం ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) శనివారం ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) వరించింది.
పైడి జయరాజ్ అవార్డు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను, బీఎన్ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు నిర్మాత సి.అశ్వినీదత్‌ను, టి.ఎల్ కాంతారావు పురస్కారం ఆర్.నారాయణమూర్తిను, రఘువెంకయ్య అవార్డు ఎ.రమేశ్ ప్రసాద్‌ను వరించాయి. ఈ ఏడాది కొత్తగా రెండు అవార్డులను ప్రకటించారు. వాటిలో ఏయన్నార్ అవార్డు సీనియర్ నటి జయసుధను, సి.నారాయణరెడ్డి అవార్డు గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను వరించాయి.