సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

God Of War: గాడ్ ఆఫ్ వార్.. గొడవ ముగిసినట్టేనా

ABN, Publish Date - Jan 18 , 2026 | 07:34 PM

ఏ కథ ఏ హీరో చేతికి చేరాలి అనేది రాసిపెట్టి ఉండాలి. ముందు ఎన్ని అవాంతరాలు వచ్చినా.. చివరకు ఆ కథ చేరాల్సిన చోటుకే చేరుతుంది.

God Of War

God Of War: ఏ కథ ఏ హీరో చేతికి చేరాలి అనేది రాసిపెట్టి ఉండాలి. ముందు ఎన్ని అవాంతరాలు వచ్చినా.. చివరకు ఆ కథ చేరాల్సిన చోటుకే చేరుతుంది. ఇండస్ట్రీలో కథల మార్పులు.. హీరోల మార్పులు కొత్తేమి కాదు. తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోల మధ్య ఒక కథ నలిగిపోతుంది. అదే గాడ్ ఆఫ్ వార్ (God Of War). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram).. కుమారస్వామి కథను సినిమాగా చూపించాలని ఆరాటపడుతున్న విషయం తెల్సిందే. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ (Allu Arjun) - త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమాను ప్రకటించారు. ఆ సినిమాలోనే బన్నీ.. కుమారస్వామిగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక పుష్ప 2 హిట్ తరువాత బన్నీ.. గురూజీని సైడ్ చేసి అట్లీతో సినిమా మొదలుపెట్టాడు. ఆ సమయంలో గురూజీ.. అదే కుమారస్వామి కథను ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేశాడు. మైథాలజీ కథ కాబట్టి ఎన్టీఆర్ కూడా టక్కున ఓకే అనడమే కాకుండా కుమారస్వామి గురించి తెలుసుకోవడానికి బుక్స్ కూడా చదవడం మొదలుపెట్టాడు. సరే ఎవరో ఒకరు.. సినిమా రావడం మాత్రం పక్కా అనుకున్నారు ప్రేక్షకులు. ఈలోపు.. బన్నీ ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమాను వదిలేలా కనిపించడం లేదు. అట్లీ తరువాత డైరెక్ట్ గా త్రివిక్రమ్ తోనే సినిమా.. ఎన్టీఆర్ ను పక్కకు నెట్టేశాడు అని వార్తలు వినిపించాయి.

అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ తో ఇప్పుడప్పుడే కలవడం కష్టం అని క్లారిటీ ఇచ్చేశాడు. అట్లీ సినిమా తరువాత లోకేష్ కనగరాజ్ తో ఒక సినిమాని ప్రకటించాడు. అట్లీ సినిమా అవ్వడానికే రెండేళ్లు పడుతుంది. ఆ తరువాత లోకేష్ తో అంటే ఇంకో ఏడాది.. మధ్యలో గురూజీతో సినిమా అంటే అవ్వని పని. ఈ లెక్కన గాడ్ ఆఫ్ వార్ గొడవ ఒక కొలిక్కి వచ్చేసినట్టే. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తోనే గాడ్ ఆఫ్ వార్ ని పట్టాలెక్కిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యిపోయింది. డ్రాగన్ ను ఫినిష్ చేసి.. తారక్.. గాడ్ ఆఫ్ వార్ లోకి అడుగుపెడతాడు. ఆ లోపు త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం ని ఫినిష్ చేస్తాడు. ఎట్టకేలకు గాడ్ ఆఫ్ వార్ సమస్య ఓకే కొలిక్కి వచ్చేసినట్లే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

Updated Date - Jan 18 , 2026 | 07:34 PM