సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చేయాల్సింది ఎన్టీఆర్‌.. చేస్తోంది విజయ్ దేవరకొండ

ABN, Publish Date - Apr 21 , 2026 | 07:25 PM

విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

Vijay Deverakonda jr ntr

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా జరిగింది. 'హాయ్ నాన్న' వంటి సున్నితమైన భావోద్వేగాల చిత్రంతో మెప్పించిన శౌర్యువ్, ఈసారి విజయ్ కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారట. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ కథ మొదట జూనియర్ ఎన్టీఆర్ (Jr NT) కోసం రాసుకున్నదనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.

నిజానికి 'హాయ్ నాన్న' ఘనవిజయం తర్వాత శౌర్యువ్ తన తదుపరి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించినట్లు సమాచారం. ఆ పాయింట్ ఎన్టీఆర్‌కు నచ్చినప్పటికీ, అప్పటికే ఆయన చేతిలో వరుస ప్రాజెక్టులు ఉండటంతో దీనికి సమయం కేటాయించడం కష్టమైంది. 'దేవర', 'వార్ 2', ప్రశాంత్ నీల్ చిత్రాలతో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వల్ల, శౌర్యువ్‌ను కొంతకాలం వేచి ఉండాలని కోరినట్లు ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ నుండి స్పష్టమైన క్లారిటీ రావడానికి సమయం పడుతుందని భావించిన శౌర్యువ్, ఇదే కథను విజయ్ దేవరకొండకు వినిపించినట్లు తెలుస్తోంది. విజయ్ కథలోని డెప్త్ చూసి వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఇమేజ్ వేరు, విజయ్ బాడీ లాంగ్వేజ్ వేరు. అందుకే దర్శకుడు హీరో మారిన నేపథ్యంలో స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేసి, విజయ్ శైలికి తగ్గట్టుగా దీనిని మలిచినట్లు సమాచారం.

ఈ సినిమా కేవలం కమర్షియల్ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, శౌర్యువ్ మార్క్ బలమైన ఎమోషన్స్‌తో సాగనుందని సమాచారం. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్లు పూర్తి చేసిన తర్వాత, ఈ ఏడాది చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఒకరకంగా చూస్తే విజయ్ దేవరకొండ మరోసారి ఒక పెద్ద స్టార్ వదులుకున్న కథతో వెండితెరపై మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు విజయ్ కెరీర్‌లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా తొలుత రామ్ చరణ్‌తో అనుకున్నదే. ఇప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన కథ విజయ్ చేతికి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Apr 21 , 2026 | 07:25 PM