యమదొంగలా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎన్నాళ్లయ్యింది సామీ ఇలా చూసి
ABN, Publish Date - Sep 29 , 2026 | 09:06 PM
వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ప్రతిభావంతుడైన దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ చిత్రాన్ని బాహుబలి వంటి అంతర్జాతీయ దృశ్యకావ్యాన్ని అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రతిభావంతుడైన దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ చిత్రాన్ని బాహుబలి వంటి అంతర్జాతీయ దృశ్యకావ్యాన్ని అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది, దీనికి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశాడు.
ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధాన ఆకర్షణ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ. యమదొంగ సినిమాలో పులి కాస్తా ఎన్టీఆర్ గా మారే ఐకానిక్ సీన్‌ను ఈ వేదికపై అద్భుతంగా రీక్రియేట్ చేశారు. చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్నారి సారా తన క్యూట్ మ్యాజిక్ ట్రిక్‌తో స్టేజ్‌పై ఉన్న పులి బొమ్మను ఎన్టీఆర్ లా మార్చే సన్నివేశం ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ వినూత్న ఎంట్రీ కాన్సెప్ట్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. చిన్నారి సారా చేసిన మ్యాజిక్ విజువల్స్, తారక్ ఎనర్జెటిక్ వాకింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియా క్లిప్పింగ్స్‌ను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా షేర్ చేస్తూ తారక్ మాస్ ఎంట్రీ అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం తారక్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా తారక్ రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం కూడా విదితమే. ఇక చాలా గ్యాప్ తరువాత తారక్.. నిర్మాత కార్తికేయ మాటను కాదనలేక ఈ ఈవెంట్ కి వచ్చాడు. ఇక చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు ఎన్నాళ్ళయ్యింది సామీ నిన్ను ఇలా చూసి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.