సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో బాలీవుడ్ హీరో?

ABN, Publish Date - Jul 05 , 2026 | 08:59 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ మైథాలజికల్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

NTR and Trivikram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ఓ మైథాలజికల్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


స్కంద పురాణంలోని కార్తికేయుడి ఇతివృత్తం ప్రధానంగా ఈ సినిమా కథాంశం సాగనుందని సమాచారం. భారతీయ పురాణాల స్ఫూర్తితో, దైవిక అంశాలను జోడించి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇందులో లోతైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన యుద్ధ ఘట్టాలు ప్రేక్షకులకు ఒక అపూర్వమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. త్రివిక్రమ్ మార్క్ మేకింగ్, ఎన్టీఆర్ విశ్వరూపం ఈ పౌరాణిక నేపథ్యానికి మరింత వన్నె తీసుకురానున్నాయి. ఇక ఈ సినిమా గురించి తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..


ఈ చిత్రంలో ఒక సీనియర్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని, ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటూ కథను మలుపు తిప్పుతుందని టాక్ నడుస్తోంది. ఈ ప్రత్యేక పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారట. అంతేకాకుండా మరికొన్ని సర్‌ప్రైజింగ్ అతిథి పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని, ఆయా పాత్రలు దేవుళ్ల రూపంలో తెరపై అద్భుతంగా ఆవిష్కృతం కానున్నాయని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు!

ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

Updated Date - Jul 05 , 2026 | 08:59 PM