సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గురూజీ.. గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఎక్కడ

ABN, Publish Date - May 21 , 2026 | 07:32 PM

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో గాడ్ ఆఫ్ వార్ (God Of War) ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)- ఎన్టీఆర్ (NTR) కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడం.. మొట్ట మొదటిసారి తారక్ కుమారస్వామిగా కనిపిస్తున్నాడు

God Of War

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో గాడ్ ఆఫ్ వార్ (God Of War) ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)- ఎన్టీఆర్ (NTR) కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడం.. మొట్ట మొదటిసారి తారక్ కుమారస్వామిగా కనిపిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. త్రివిక్రమ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ స్క్రిప్ట్‌గా దీనిని సిద్ధం చేస్తున్నాడు. హై ఎండ్ VFX, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ గ్రాండియర్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.


కొన్నిరోజుల నుంచి గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కనీసం.. ఎన్టీఆర్ లుక్ కానీ, త్రివిక్రమ్తో ఎన్టీఆర్ దిగిన ఫోటో కానీ, బర్త్ డే విషెస్ కానీ.. అధికారిక ప్రకటన కానీ, ఒక చిన్న గ్లింప్స్ అయినా రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ, గురూజీ.. ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచాడు. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు అయ్యిపోయింది. ఇప్పటివరకు గాడ్ ఆఫ్ వార్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ గురూజీ.. గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా మారాడు. వీరిద్దరూ తమ తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత గాడ్ ఆఫ్ వార్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా డ్రాగన్ గ్లింప్స్ తో పాటు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ కూడా వచ్చి ఉంటే బావుండేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి గురూజీ.. గాడ్ ఆఫ్ వార్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Updated Date - May 21 , 2026 | 07:55 PM