Ntr Fans: ఊరు-వాడ సోషల్ కాజ్ కోసం.. రాజకీయం చేయవద్దు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:01 PM
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ వచ్చింది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) ఈ నెల 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ వచ్చింది. వీటిపై స్పందిస్తూ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఓ లేఖ విడుదల చేసింది. 18న నిర్వహించనున్న ‘ఊరు-వాడ’ కార్యక్రమానికి.. తారక్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధం (Political entry) లేదని తెలిపింది. ఇదొక సోషల్ కాజ్‌తో చేస్తున్న కార్యక్రమమని తెలిపారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో హీరో విజయ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆయన బాటలోనే నడవాలని కొందరు హీరోలు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్య అల్లు అర్జున్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా బన్నీని కలిశారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి దాకా దీఇపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ నెల 18న జరగనున్న ఊరు-వాడ కార్యక్రమానికి ఎప్పుడో ప్రణాళిక ని రూపొందించాం. కాబట్టి దీనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. అసత్య ప్రచారాలృను నమ్మవద్దు. ఇలాంటి వార్తల్ని నమ్మవద్దని సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు’ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది.
ALSO READ:
S Janaki: జానకమ్మ అంతిమయాత్రలో కనిపించిన సంస్కారం.. నెటిజన్ల ప్రశంసలు
Chiranjeevi: అఖిల్ ప్రతి సినిమాతో పరిణతి సాధిస్తున్నాడు
Laya: సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకే రోజు రెండు సినిమాలు!