Ntr Fans: తారక్ బర్త్‌డే.. ఆ కుటుంబానికి ఎంత అభిమానమో..
ABN, Publish Date - May 26 , 2026 | 05:19 PM
ఎన్టీఆర్‌కు (Jr Ntr) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. కెరీర్ బిగినింగ్ నుంచీ పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.
ఎన్టీఆర్‌కు (Jr Ntr) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. కెరీర్ బిగినింగ్ నుంచీ పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ భాషపై పట్టు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే సింగిల్ టేక్‌లో సీన్ చేయగల సత్తా ఉన్న నటుడు. ప్రస్తుతం తారక్ కథానాయకుడిగా ‘డ్రాగన్’ (Dragon) చిత్రం తెరకెక్కుతోంది. ఆయన బర్త్ డే కానుకగా మే 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
తారక్‌కు ఇండియానే కాకుండా జపాన్, యూఎస్‌ఏలో కూడా అభిమానులున్నారు. అయితే పాకిస్థాన్‌లో కూడా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారు. అవును ఇది నిజం.. ఎన్టీఆర్ బర్త్‌డేను పాకిస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం ఘనంగా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన వ్యక్తి పేరు సులేమాన్. ఆయన కుటుంబం అంతా ఈ నెల 20 ఒక చోట చేరి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. అంతే కాదు కేక్‌పై డ్రాగన్ టర్న్స్ 43 అని రాయించారు. ఇంట్లో వాళ్లంతా కలిసి హ్యాపీ బర్త్ డే అన్నా అని పాడుతూ విష్ చేస్తూ తారక్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.