ఇప్పుడు.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు
ABN, Publish Date - Mar 12 , 2026 | 06:05 AM
ఇక ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయానికి వస్తే, గతంలో ఒకాయన ఉండేవారు. ఇప్పుడు ఎవరూ ఆ స్థానంలో లేరు. బహుశా ఇంకొకరు ఆ స్థానంలోక రాకపోవచ్చు. అని తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
ఇండస్ట్రీలో నాకు ఇక మనుగడ లేదనుకున్న టైమ్‌లో ‘వదలా’ (Vadhala) చిత్రం నా దగ్గరకు వచ్చింది. ఇక ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయానికి వస్తే, గతంలో ఒకాయన ఉండేవారు. ఇప్పుడు ఎవరూ ఆ స్థానంలో లేరు. బహుశా ఇంకొకరు ఆ స్థానంలోక రాకపోవచ్చు. మనం చేసే పనులను బట్టే ఎవరికైనా ఆ పెద్దరికం వస్తుంది’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy)స్పందించారు.
జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిశోర్‌నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం నిర్వహించిన ‘వదలా’ చిత్రం ప్రెస్‌మీట్‌లో తమ్మారెడ్డి భరద్వాజపై వ్యాఖ్యలు చేశారు.
ఇక.. మధ్య ప్రదేశ్ భోపాల్‌లో సినిమా తీసే వారికి మంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అందుకే మా మొత్తం సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్న దాని కన్నా తక్కువలో పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం మన దగ్గర అలాంటి సిట్యువేషన్ లేదని అన్నారు.