సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘తత్వం’ ముగింపును ఎవరూ ఊహించలేరు

ABN, Publish Date - Oct 02 , 2026 | 07:14 AM

‘తత్వం’ సినిమాలో ఊహించలేని ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు. ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కొత్తగా ఉంటుంది’ అని హీరో దినేశ్‌ తేజ అన్నారు.

Tatvam

‘‘తత్వం’ సినిమా (Tatvam Movie) లో ఊహించలేని ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో హీరో తాను ఏమి తెలుసుకున్నాడు, ఏ ‘తత్వం’ బోధపడింది అనే పాయింట్‌తో పాటు ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కొత్తగా ఉంటుంది’ అని అన్నారు హీరో దినేశ్‌ తేజ (Dinesh Tej) . ఆయన, దష్విక (Dhasvika Kinthalli) జంటగా అర్జున్‌ కోలా తెరకెక్కించిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించారు.

సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా దినేశ్‌ తేజ మీడియాతో ముచ్చటించారు. ‘ఈ సినిమా 2000 సంవత్సరం నేపథ్యంలో ఉంటుంది. మూఢనమ్మకానికి, నమ్మకానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాని చుట్టే ఈ కథ తిరుగుతుంది. ఈ కథ విన్న రోజున నాలో ఎలాంటి నమ్మకం ఏర్పడిందో, ఇప్పుడూ అదే నమ్మకంతో ఉన్నాను. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. కొత్తదనం ఉన్న ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా కథే మా ధైర్యం, ప్రేక్షకులే మా బలం’ అని అన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 07:14 AM