నితిన్ సరసన రుక్మిణి.. అదేం లేదంట
ABN, Publish Date - Jul 14 , 2026 | 03:35 PM
నేచురల్ స్టార్ నాని (Nani) ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో యంగ్ హీరో నితిన్ (Nithiin)హీరోగా దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.
నేచురల్ స్టార్ నాని (Nani) ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో యంగ్ హీరో నితిన్ (Nithiin)హీరోగా దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. గత కొన్నేళ్లుగా నితిన్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. ఎలాగైనా ఈసారి హిట్ అందుకోవాలని నితిన్ పట్టుబట్టాడు. అందులో భాగంగానే మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇక నితిన్ కి సపోర్ట్ గా నాని రంగంలోకి దిగడంతో ఈసారి నితిన్ కి హిట్ అందినట్టే అని టాక్ నడుస్తోంది. అధికారికంగా ఈ ప్రాజెక్టు ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ, సినిమా మాత్రం దాదాపు సెట్ అయిపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. హిట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి నటిస్తోందని తెలియడంతో సూపర్ కాంబో అని నెటిజన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇందులో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని టాక్ నడుస్తోంది. రుక్మిణికి మేకర్స్ కథ వినిపించడం వరకు ఓకే కానీ.. ఆమె ఈ కథ చేస్తానని చెప్పలేదట. అంటే.. సరే చూద్దాం అని చెప్పింది అంతే కానీ, సినిమా చేస్తాను అని హామీ ఇవ్వలేదట. దీంతో రుక్మణి ఈ సినిమాలో నటిస్తోంది అనేది కేవలం పుకారు మాత్రమే.
ప్రస్తుతం నితిన్ ఈ సినిమా కాకుండా మరో సినిమా చేస్తున్నాడు. అది షూటింగ్ దశలో ఉంది. అది పూర్తయ్యేసరికి అక్టోబర్ అవుతుంది. ఆ తరువాత కానీ ఈ సినిమా పట్టాలెక్కదు. ఇంకోపక్క రుక్మిణి డ్రాగన్ తో బిజీగా ఉంది. డేట్స్ సర్దుబాటు అవుతాయో లేదో తెలియదు. ఆమె డేట్స్ ఇచ్చి.. అక్టోబర్ లో సెట్ మీదకు వెళ్తే తప్ప.. ఈ పుకారు నిజం కాదు. మరి ఈ ముద్దగుమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.