సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనుమానం లేదు.. డెకాయిట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

ABN, Publish Date - Apr 08 , 2026 | 06:56 AM

'డెకాయిట్‌’ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందులో డౌట్‌ లేదు’ అని హీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు.

venkatesh

‘శేష్‌ని ‘పంజా’లో చూశాను. అప్పుడే తను చాలా అద్భుతమైన నటుడు అవుతాడు అనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి. ‘డెకాయిట్‌’ (Dacoit) కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందులో డౌట్‌ లేదు’ అని హీరో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) అన్నారు.

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా షానియల్‌ డియో (Shaneil) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘డెకాయిట్‌’. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ఈనెల 10న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌ చూడగానే ఇది కచ్చితంగా విజయవంతమైన సినిమా అవుతుందని అనిపించింది’ అని అన్నారు. అడివి శేష్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు. నా నుంచి సక్సెస్‌లు చూశారు. అంతకుముందు ఫెయిల్యూర్‌లు కూడా చూశారు. కానీ ఈ సినిమాలో మేము సినిమాని ఎంత ప్రేమించామో చూస్తారు’ అని అన్నారు.

సుమంత్ (Sumanth) మాట్లాడుతూ, ‘మృణాల్‌ గారి పర్ఫార్మెన్స్‌లో చాలా నిజాయితీ ఉంటుంది. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. నిర్మాత సుప్రియ మాట్లాడుతూ ‘నాన్నగారి ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌లో మరో మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ‘డెకాయిట్‌’ స్టార్ట్‌ చేశాను. మా అన్నయ్య సుమంత్‌ ఈ సినిమాకి సైలెంట్‌ ప్రొడ్యూసర్‌’ అని చెప్పారు.

Updated Date - Apr 08 , 2026 | 09:08 AM