త్రివిక్రమ్ స్కెచ్.. వెంకీ కోసం ఆ హీరోయిన్‌తో ఐటెంసాంగ్
ABN, Publish Date - Jun 05 , 2026 | 03:08 PM
ఈమధ్య టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్ చేయించడంతో ఆ సీన్ ఈమెపై మారినంత హైప్ పెరుగుతోంది.
ఈమధ్య టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్ చేయించడంతో ఆ సీన్ ఈమెపై మారినంత హైప్ పెరుగుతోంది. అంతేకాకుండా ఆ స్టార్ హీరోయిన్స్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తోంది. దీంతో అటు మేకర్స్.. ఇటు హీరోయిన్స్ ఐటెంసాంగ్ చేయడానికి అస్సలు వెనుకాడడం లేదు. ఇక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) సైతం ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్.. వెంకటేష్ తో కలిసి ఆదర్శ కుటుంబం సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోండగా.. మరో హాట్ భామ నివేతా పేతురాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరి అని, అందుకే నివేతాను తీసుకున్నాడని అనుకున్నారు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి నివేతాను సెకండ్ హీరోయిన్ గా కాకుండా ఐటెంసాంగ్ కోసం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. గురూజీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే క్లాస్, మాస్ కలిపి ఉంటాయి. ఐటెంభామ లు కూడా ఎంతో పద్దతిగా కనిపిస్తారు. కానీ, ఈసారి గురూజీ మంచి మాస్ మసాలా సాంగ్ ను తెరకెక్కిస్తున్నాడట. ఇందులో నివేతా అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ ఐటెంసాంగ్ తో సినిమాపై మరింత హైప్ తీసుకురావచ్చని గురూజీ కొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం. మరి నివేతా.. ఈ ఐటెంసాంగ్ తో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.