హిట్ డైరెక్టర్ ని పట్టిన నితిన్.. ఈసారి తిరుగులేదంతే
ABN, Publish Date - Jul 26 , 2026 | 09:44 PM
యంగ్ హీరో నితిన్ (Nithiin) గత కొంతకాలంగా వరుస ప్లాప్‌లతో తీవ్రంగా నిరాశపరుస్తున్న విషయం తెల్సిందే.
యంగ్ హీరో నితిన్ (Nithiin) గత కొంతకాలంగా వరుస ప్లాప్‌లతో తీవ్రంగా నిరాశపరుస్తున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు వరుస యూత్‌ఫుల్ హిట్స్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఆయన, ప్రస్తుతం ఒక సరైన సాలిడ్ హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. కథల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విజయాలు మాత్రం దూరమవుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైన నితిన్, నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్‌లో ఒక ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు.
టాలీవుడ్‌లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాని, తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో నితిన్ కథానాయకుడిగా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విభిన్నమైన కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి శ్రీవిష్ణుకిసామజవరగమన, శర్వాకు నారీ నారీ నడుమ మురారీ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ని అందించిన యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీవిష్ణుతో ఒక సినిమా చేస్తున్న రామ్ అబ్బరాజు, ఆ వెంటనే నితిన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు.
నాని ప్రొడక్షన్ వాల్యూస్, రామ్ అబ్బరాజు క్లీన్ అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ టైమింగ్ నితిన్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని టాక్. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. అందులో నాని కూడా ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేయకుండా.. బాగా నచ్చి, హిట్ అవుతుంది అని నమ్మకం ఉంటేనే ఆ కథలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. హిట్ లేని హీరోలకు హిట్స్ ఇస్తున్న డైరెక్టర్ కావడంతో ఈసారి నితిన్ కి కూడా హిట్ ఇస్తాడు అని అందరూ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.