Nithiin: నితిన్‌కి జోడీ.. కుదిరినట్టేనా..
ABN, Publish Date - Apr 24 , 2026 | 02:48 PM
నితిన్ సరైన విజయం అందుకుని చాలా కాలమైంది. గడిచిన మూడేళ్లల్లో విడుదలైన నాలుగు చిత్రాలు పరాజయాల్ని చవి చూశాయి.
నితిన్ (Nithiin) సరైన విజయం అందుకుని చాలాకాలమైంది. గడిచిన మూడేళ్లల్లో విడుదలైన నాలుగు చిత్రాలు పరాజయాల్ని చవిచూశాయి. ఇప్పుడు ఆయన కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ మధ్యన చాలామంది దర్శకులు చెప్పిన కథల్ని తిరస్కరించారు. ఎప్పటి నుంచో ఆయనే హీరో అనుకున్న ‘ఎల్లమ్మ’ (yellamma) చిత్రం కూడా మిస్ అయింది. తాజాగా నితిన్‌కు కొత్త దర్శకుడు ఓ కథ చెప్పారు. అది నచ్చడంతో నితిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెలాఖరులో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఇందులో కథానాయికగా మిరాయ్ ఫేం రితికా నాయక్‌ను (Ritka Naik) ఎంపిక చేసినట్లు తెలిసింది. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో రితిక తెలుగు తెరకు పరిచయమైంది. తదుపరి ‘మిరాయ్’తో పెద్ద హిట్ అందుకుంది. వరుణ్‌తేజ్‌తో కొరియన్ కనకరాజు, పవర్‌పేట చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు నితిన్‌తో మరో ఆఫర్ అందుకొంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. టైటిల్‌తోపాటు త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.