సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లవ్ స్టోరీలో 'కేజీఎఫ్‌'... 'నిలవే'!

ABN, Publish Date - Feb 12 , 2026 | 11:38 AM

మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'నిలవే' సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. 'సఖి', 'ఏ మాయ చేశావే' తరహాలో మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలనే ఆకాంక్షను సింగర్ సునీత వ్యక్తం చేశారు.

Nilave movie

సౌమిత్ పోలాడి (Sowmith Poladi) హీరోగా నటిస్తూ సాయి కె వెన్నం (Sai K Vennam) తో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం 'నిలవే' (Nilave). ఈ సినిమాతో శ్రేయాసి సేన్ (Shreyansi Sen) హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటిస్తున్నారు. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం మాదాపూర్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, 'ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలను చూస్తున్నాం. అలాంటి అన్ని ఎమోషన్స్‌తో రూపుదిద్దుకున్న చిత్రమే ఇది. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే వుంటుంది. నేను ఇక్కడ వుండడానికి కారణం కూడా అదే! ఈ మూవీ నేను చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని థియేటర్‌లో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాను. క్లాసికల్ మూవీస్ 'సఖి, ఏ మాయే చేశావే' తరహాలో ఇదీ ఆదరణ పొందుతుందని భావిస్తున్నాను. ఇందులోని పాటలు బాగున్నాయని ఒకసారి వినమని కీరవాణి గారిని కోరాను. ఆయన విని, తన వంతుగా సపోర్ట్ చేశారు' అని అన్నారు.


హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమాలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ మూవీ నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. జన్ జీ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను' అని తెలిపారు. హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ, 'చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక వుండేది. అందుకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారే నాకు స్పూర్తి. ఫిబ్రవరి 13న తొలి సినిమా 'నిలవే' విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్ షోస్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్‌లో 'కె.జి.ఎఫ్.' ఎలాంటిదో, లవ్ స్టోరీస్‌లో 'నిలవే' అలాంటిది' అని చెప్పారు. చిత్ర దర్శకుడు సాయి కె వెన్నం మాట్లాడుతూ, '30 లక్షల రూపాయలలో మంచి సినిమా తీయొచ్చు. కానీ జనాల్లోకి దానిని తీసుకెళ్ళాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని ఆ మధ్య ఓ దర్శకుడు అన్నారు. అలానే హీరో నాని (Nani)... 'కోర్ట్' సినిమా చూడండి, నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ చూడకండి అంటూ బెట్ వేశారు. కానీ మేం అలాంటి బెట్స్ వేయలేం. మా దగ్గర మంచి సినిమా వుంది. అందరి సహకారంతో దీన్ని రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గారిని ఆ మధ్య కలిసినప్పుడు ‘ఇక్కడ ఎవరూ క్రిస్టోఫర్ నోలన్ లేరు.. మన సినిమాను మనమే నమ్మాలి. నాకది వర్క్‌వుట్ అయ్యింది. నువ్వు కూడా అదే నమ్ము’ అని చెప్పిన మాట నాలో స్ఫూర్తిని నింపింది’ అని అన్నారు.

'నిలవే' చిత్రంలో ఉన్న పదకొండు పాటలూ కథతో సాగేవేనని సంగీత దర్శకుడు కళ్యాణ్‌ నాయక్ చెప్పారు. కొత్తవారే అయినా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ బాధ్యతలను చక్కగా నెరవేర్చారని నిర్మాత రాజ్ అల్లాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మాధురి, నటి సత్యశ్రీ, ఆర్ అండ్ ఎ ట్రావెల్స్ అనురాధ, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్ గిరిధర్ రావు, నటుడు రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:39 AM