Newton's 3rd Law Trailer: అర్హతకు మించి ఎక్కువ ఆశించకూడదు.. సుమంత్ అదరగొట్టేశాడు
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:08 PM
అనగనగా సినిమా తరువాత హీరో సుమంత్ (Sumanth) జోష్ పెంచాడు. వరుస సినిమలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన సినిమా న్యూటన్స్ 3ర్డ్ లా (Newton's 3rd Law).
అనగనగా సినిమా తరువాత హీరో సుమంత్ (Sumanth) జోష్ పెంచాడు. వరుస సినిమలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన సినిమా న్యూటన్స్ 3ర్డ్ లా (Newton's 3rd Law). రాజేష్ కర్ణ దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా కనిపించనుండగా.. శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆరంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠను, సస్పెన్స్‌ను రేకెత్తించేలా ఉంది. ఒక ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజాలు, అది హత్యనా లేక యాక్సిడెంటా అనే మిస్టరీ చుట్టూ కథ నడుస్తున్నట్లు చూపించారు. యాక్షన్ - రియాక్షన్ అనే ఫిజిక్స్ సూత్రం ఆధారంగా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మర్క్యూరీ, వినయ్ అనే పాత్రల మధ్య కనెక్షన్‌ను వెలికితీసే ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ సినిమాను మలచినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సుమంత్ కనిపించగ.. అతనికి సహాయం చేసే పోలీస్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల కనిపించాడు. కథ ఏంటి అనేది రివీల్ చేయకుండా ఎంతో ఉత్కంఠగా ట్రైలర్ ని కూత చేసి సినిమాపై హైప్ పెంచారు.
సుమంత్ తన నటనతో, డిఫరెంట్ షేడ్స్‌తో ఆకట్టుకోగా, జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ థ్రిల్లింగ్‌గా ఉండటంతో పాటు ట్విస్ట్ లకు కచ్చితంగా ఫ్యాన్స్ షాక్ అవుతారనిపిస్తుంది. ట్రైలర్ తరువాత ఈ సీట్-ఎడ్జ్ థ్రిల్లర్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 31న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.