సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్ ‘రాకా’తో ఇండియన్ సినిమాకు కొత్త రికార్డులు.. 900 కోట్ల బడ్జెట్‌తో అట్లీ ప్లాన్!

ABN, Publish Date - May 08 , 2026 | 09:19 AM

పుష్ప-2తో 1700 కోట్ల వసూళ్లు సాధించిన అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ‘రాకా’తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. పుష్ప సిరీస్‌తో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన బన్నీ, పుష్ప-2 (Pushpa 2) తో ఏకంగా 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశారు. ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ బన్నీ సాధించిన ఈ విజయం ఇప్పుడు యావత్ సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అయితే, పుష్ప తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా పెరుగుతాయి. అయితే ఆ అంచనాలకు మించి రాకా ఉండబోతుందని టాక్‌ వినిపిస్తుంది.

టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్‌కు కోలీవుడ్ మాస్ డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుందో చూపించేందుకు అట్లీ (Atlee)రంగంలోకి దిగారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన క్షణమే సినీ ప్రియులందరి ఊహలకు అందని విధంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం సౌత్ లేదా నార్త్ మార్కెట్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా అట్లీ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది.. పుష్ప అంటే లోకల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్! అని. సరిగ్గా అదే మాటను నిజం చేస్తూ రాకా ( Raaka Movie) సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం సుమారు 900 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.

ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయి ఖర్చు అంటే అది సామాన్యమైన విషయం కాదు. విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ వాల్యూస్ ఇంకా ప్రతి చిన్న విషయంలోనూ చిత్ర బృందం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరుకు విడుదల చేయాలని భావించారు. కానీ స్క్రిప్ట్ వర్క్, నటీనటుల మేకోవర్స్ కోసం మరికొంత సమయం అవసరమని మేకర్స్ భావిస్తున్నారు. బన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో, అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసం ఎంత సమయం అయినా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ సినిమా విడుదల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

మొన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ కేవలం ఒకే ఒక్క పోస్టర్‌తో సోషల్ మీడియాను ఊపేసింది చిత్ర బృందం. ఆ ఫోటో చూస్తుంటేనే రాకా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. కేవలం ఒక ఫోటోకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే, ఇక టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ అయితే అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఏది ఏమైనా రాకా ఎప్పుడు వచ్చినా సరే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. అల్లు అర్జున్ క్రేజ్, అట్లీ మేకింగ్ కలిసి ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయని ఆశించవచ్చు.

Updated Date - May 08 , 2026 | 09:19 AM