సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fauzi: ప్రభాస్‌ సినిమాకు.. కొత్త త‌ల‌నొప్పి?

ABN, Publish Date - Jul 08 , 2026 | 07:17 PM

డార్లింగ్ ప్రభాస్ అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తాడో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

fauzi

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తాడో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి నుంచి కల్కి వరకు ఆయన రేంజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. థియేటర్లలోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. అయితే తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఓటీటీ దిగ్గజం పెట్టిన ఒక కండిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు థియేట్రికల్ కలెక్షన్స్‌తో పాటు ప్రధాన ఆదాయ వనరుగా మారింది ఓటీటీ డీల్స్. ఒకప్పుడు చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఓటీటీ రైట్స్ కోసం తీవ్ర చర్చలు జరిగేవి. కానీ ఈ మధ్యకాలంలో సక్సెస్ రేట్ తగ్గడంతో ఓటీటీ సంస్థలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పెద్ద సినిమాల విషయంలో డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నా సరే, ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త కండిషన్ పెడుతున్నారు. అదే డెడ్‌లైన్. నిర్మాతలు ఓటీటీ సంస్థలు సూచించిన రిలీజ్ డేట్‌కే కచ్చితంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. ఓటీటీలు ఇస్తున్న భారీ ఆఫర్లతోనే నిర్మాతలు చాలా వరకు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారు కాబట్టి, వాళ్లు చెప్పిన కండిషన్స్‌కు తల ఊపక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం ఫౌజీ (Fauzi) విషయంలో కూడా ఇలాంటి వార్తలే ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ సైలెంట్‌గా, స్లో అండ్ స్టడీగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, మేకర్స్ కావాలనే ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో, ప్రభాస్ ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్‌గా కనిపించబోతున్నారు. నిజానికి స్టార్టింగ్‌లో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా హైప్ లేదు. కానీ మూవీ యూనిట్ పక్కా ప్లానింగ్‌తో అంచనాలు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

ఫౌజీ సినిమా కథను ఎవరూ కలలో కూడా ఊహించలేరని, ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రాని ఒక అద్భుతమైన కొత్త కథను హను రాఘవపూడి ప్రెజెంట్ చేస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో ఉంటుందని హింట్ ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా పూనకాలు వచ్చేశాయి. నిజానికి ఫౌజీ సినిమాకు, నాగవంశీకి నేరుగా ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే ఆయన అంత ధీమాగా చెప్పాడంటే కథలో ఎంత దమ్ముందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫౌజీ డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక కఠినమైన డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసి రిలీజ్‌ చేయాలని రూల్ పాస్ చేసిందట. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల అనుకున్న తేదీకి సినిమా రాకపోతే, డీల్ ప్రైస్‌ను తగ్గించడం లేదా ఒప్పందంలో కీలక మార్పులు చేయడం జరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పెట్టిన డెడ్‌లైన్‌ను దృష్టిలో ఉంచుకునే దర్శకుడు హను రాఘవపూడి పక్కా షెడ్యూల్స్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, అటు డార్లింగ్ ఫ్యాన్స్ ఆత్రుత, అలానే నెట్‌ఫ్లిక్స్ డిమాండ్ ఈ ఏడాది నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.

Updated Date - Jul 08 , 2026 | 07:50 PM