న్యూ గై ఇన్ టౌన్.. ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
ABN, Publish Date - May 22 , 2026 | 09:40 PM
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ఆ మధ్య ‘న్యూ గై ఇన్ టౌన్’ అంటూ ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ న్యూ గైగా అనీష్ (Aniesh) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకుడు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టినట్లుగా చెబుతూ.. టీమ్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పియానోపై ఓ ట్యూన్ వాయించేందుకు అనీష్ ప్రయత్నిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ ‘ఓజీ’ థమన్ ఎస్ (Thaman S).. కాఫీ మగ్ చేతిలో పట్టుకుని అతన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది. అనీష్ వాయిస్తున్న ట్యూన్‌ను చూసి సరదాగా ఆటపట్టించిన థమన్.. అనంతరం తనదైన శైలిలో మ్యూజికల్ మ్యాజిక్‌ను రివీల్ చేశారు. ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ హంటింగ్ చేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ను మే 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రోమోను చూస్తుంటే.. ఫస్ట్ సింగిల్ ఒక బ్యూటీఫుల్ మెలోడీగా అలరించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో పాత్ర చెవిటి, మూగ యువకుడు కావడంతో సంగీతం కథలో మరింత కీలక పాత్ర పోషించనుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?