సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్.. 'కెరూబ్'
ABN, Publish Date - Aug 13 , 2026 | 05:12 PM
విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా నటించిన కెరూబ్ మూవీ సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానుంది. ఎం.జె. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌పై ఆసక్తి పెరుగుతోంది.
విహాన్ కార్తీక్ (Vihan Karthik), దివ్య విశ్వకర్మ (Divya Viswakarma)జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెరూబ్’(KHERRUB). ఖుషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బాలు బల్లెకారి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.జె. నాయుడు (జీవన్) దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. పచ్చని ప్రకృతి, జలపాతం నేపథ్యంలో హీరో వేణువు వాయిస్తున్నట్టుగా కనిపించే ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది.
సాధారణ ఫాంటసీ కథలకు భిన్నంగా ‘కెరూబ్’లో థ్రిల్, మిస్టరీతో పాటు ఫాంటసీ అంశాలను సరికొత్తగా చూపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఫస్ట్ కాపీ సిద్ధం కాగా, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.