సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aakasam Lo Oka Tara: ఆకాశంలో ఒక‌ తార.. హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

ABN, Publish Date - Jan 19 , 2026 | 11:29 AM

ల‌క్కీ భాస్క‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న తెలుగు చిత్రం ఆకాశంలో ఒక తార చిత్రం నుంచి హీరోయిన్ లుక్ రిలీజ్ అయింది.

Sathvika Veeravalli

ల‌క్కీ భాస్క‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) హీరోగా న‌టిస్తోన్న తెలుగు చిత్రం ఆకాశంలో ఒక తార (Aakasam Lo Oka Tara). గీతా ఆర్ట్స్ (Geetha Arts), స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా (Light Box Media) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోండ‌గా ప‌వ‌న్ సాధినేని (pavan Sadineni) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జీవీ ప్ర‌కాశ్ సంగీతంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే సినిమా ప్రారంభించి సుమారు ఏడాదిన్న‌ర అవుతుండ‌గా మూవీకి సంబంధించిన విష‌యాలేవి ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు.

అయితే.. తాజాగా ఈ సినిమాలోని క‌థానాయిక‌ను ప‌రిచ‌యం చేసే క్ర‌మంలో మేక‌ర్స్ ఆదివారం హీరోయిన్ ఫేస్ క‌న‌బ‌డ‌కుండా ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచారు. కాగా సోమ‌వారం ఆ న‌టి ఫ‌స్ట్ లుక్‌ను, పేరును రివీల్ చేశారు. అమెరికాలో స్థిర ప‌డిన అచ్చ‌ తెలుగింటి అందం సాత్విక వీర‌వ‌ల్లి (Sathvika Veeravalli) ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్ , సాత్విక ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అంతేగాక ఈ సంద‌ర్భంగా రిలీజ్‌ చేసిన వీడియో గ్లిమ్స్ సైతం ఆస‌క్తిక‌రంగా ఉండి సినిమాపై అటెన్ష‌న్ తీసుకు వ‌స్తోంది. ఈ వేస‌విలో ఈ చిత్రం థియేట‌ర్ల‌కు రానుంది.

Updated Date - Jan 19 , 2026 | 11:58 AM