సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హే.. ఆర్ఆర్ఆర్ మల్లి.. ఇంత హాట్ గా మారిందేంటి

ABN, Publish Date - Jun 19 , 2026 | 03:18 PM

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో కొమ్మ ఊయల.. కోన జంపాల అంటూ అందమైన పాట పాడి బ్రిటిష్ రాణిని మెప్పించిన మల్లిని అంతా త్వరగా ఎవరూ మర్చిపోలేరు.

Twinkle Sharma

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో కొమ్మ ఊయల.. కోన జంపాల అంటూ అందమైన పాట పాడి బ్రిటిష్ రాణిని మెప్పించిన మల్లిని అంతా త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే సినిమా మొత్తం ఆ చిన్నారి చుట్టూనే తిరుగుటూ ఉంటుంది. సినిమాలో ఎంతో అమాయకంగా, డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన మల్లి ఇప్పుడెక్కడ ఉంది.. ? ఏం చేస్తోంది.. ? అని అందరిలో ఎంతో కొంత ఆసక్తి ఉండే ఉంటుంది. అలా మల్లి గురించి తెలుసుకోవాలనుకొనేవారందరికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఏ.. ఏమైంది అంటే.. ఇప్పుడు మల్లిని చూసి వారవ్వరూ గుర్తుపట్టరు అంటే అతిశయోక్తి కాదు. ఆ అమాయకమైన మల్లి ఇప్పుడు యమా హాట్ గా తయారయ్యింది మరి.

ఆ చిన్నారి మల్లి పేరు ట్వింకిల్ శర్మ. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిన ట్వింకిల్ ఇంకోపక్క డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపూ తెచ్చుకుంటుంది. తాజాగా అమ్మది ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో చూసిన అమాయకపు మల్లి ఏంటి.. ఇంత హాట్ అండ్ బోల్డ్‌గా మారిపోయింది అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్స్ గా మారి తమ సత్తా చూపుతున్నారు.

ట్వింకిల్ శర్మ అభినయాన్ని ఇప్పటికే అందరూ చూశారు. ఇక అందం విషయంలో కూడా ఆమెకు ఆమె సాటిగా నిలిచింది. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో అమ్మడు అదరగొడుతోంది. త్వరలోనే కుర్ర హీరోల సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి తెలుగు డైరెక్టర్ల కంట ట్వింకిల్ పడుతుందేమో చూడాలి.

Updated Date - Jun 19 , 2026 | 03:34 PM