కొరియన్ కనకరాజు.. ఎలారా ఈ సినిమాను థియేటర్ లో హిట్ చేశారు
ABN, Publish Date - Sep 06 , 2026 | 06:25 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్ కథానాయికగా నటించిన వినూత్న హారర్ కామెడీ డ్రామా కొరియన్ కనకరాజు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, రితికా నాయక్ కథానాయికగా నటించిన వినూత్న హారర్ కామెడీ డ్రామా కొరియన్ కనకరాజు (Korean Kanakaraju). వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హారర్, కామెడీకి ఇండో-కొరియన్ టచ్ ఇచ్చి తెరకెక్కించిన ఈ చిత్రం, ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. వరుణ్ - సత్య కామెడీ టైమింగ్‌తో పాటు వినూత్నమైన కాన్సెప్ట్ కావడంతో థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుని సుమారు రూ. 37 కోట్ల వరకు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. కొన్నేళ్లుగా విజయాలు లేని వరుణ్ కి గట్టి కంబ్యాక్ ఇచ్చింది.
ఇక థియేటర్లలో మంచి విజయవంతమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, థియేటర్లలో హిట్టయిన ఈ సినిమాకు ఓటీటీలోకి వచ్చాక మాత్రం నెటిజన్ల నుంచి ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ఎదురవుతోంది. సినిమాలో కథ ఏమి లేదని కొందరు.. కొన్ని కామెడీ సీన్స్ తప్ప స్టోరీ లేదు అని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా సత్య లేకపోతే ఈ సినిమా చూడడం కూడా దండగే అని అంటున్నారు.
స్క్రీన్ ప్లే చాలా రొటీన్‌గా ఉంది, సెకండాఫ్ అస్సలు బాలేదు అంటూ డిజిటల్ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అసలు ఈ సినిమాను థియేటర్లలో ఎలా చూశారో, బాక్సాఫీస్ వద్ద ఎలా హిట్ చేశారో అర్థం కావడం లేదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓటీటీలో చూసిన వారు కథనంలో దమ్ము లేదని, కొన్ని సీన్లు చూస్తుంటే బాబోయ్ తీవ్రమైన టార్చర్ అనిపిస్తోందంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఓటీటీలో కొత్త రికార్డులు ఏమైనా క్రియేట్ చేస్తుందేమో చూడాలి.