సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Netizen Fire: భాష, మూలాలు, గుర్తింపులు అంటూ ఇంకా ఎంతకాలం?

ABN, Publish Date - Jun 05 , 2026 | 05:34 PM

గతవారం రోజులుగా తెలంగాణలో కొందరు పవన్‌కల్యాణ్‌పై విమర్శల అస్త్రాలను సంధిస్తున్న సంగతి తెలిసిందే!

గతవారం రోజులుగా తెలంగాణలో కొందరు పవన్‌కల్యాణ్‌పై విమర్శల అస్త్రాలను సంధిస్తున్న సంగతి తెలిసిందే! తెలంగాణలో మీటింగ్‌ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విషయంలో సంబంధంలేనివారు మాట్లాడుతూ, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఈ ఉదంతం అంతా సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నసంగతి తెలిసిందే!

లోకం మారుతున్నా కొందరు జనాలు మాత్రం మారడం లేదనీ, కులాలు, ప్రాంతాలు అని కొట్టుకుంటున్నారని మండిపడుతూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఫిలిం మేకర్ కూచిపూడి వెంకట్ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.  

ఆ సారాంశం ఏంటో మీరూ చదివేయండి...

'చే గువేరా అర్జెంటీనావాడు… కానీ క్యూబాలో ఒక కల్ట్ ఐకాన్ అయ్యాడు..

బరాక్ ఒబామా ఒక ఆఫ్రికన్ వలస దారుడి కుమారుడు… కానీ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు..

భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్, ఒకప్పుడు ప్రపంచంలో 60% ప్రాంతాన్ని పాలించిన బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యాడు.

సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు జహ్రాన్ మమ్దానీ నేడు న్యూయార్క్ నగర మేయర్.

మన దేశంలోనే చూస్తే… మలయాళీ అయిన ఎంజీఆర్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. కన్నడ కుటుంబంలో పుట్టిన జయలలిత తమిళనాడును పాలించింది.

ప్రపంచమంతా, చరిత్రంతా ఇలాంటి ఉదాహరణలతో నిండి ఉంది.

ఈరోజు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యున్నత రాజకీయ, పరిపాలనా, వ్యాపార పదవుల్లో ఉన్నారు.

అయినా కొందరు మాత్రం ఇంకా ప్రాంతం, భాష, మూలాలు, గుర్తింపులు అంటూ ఏడుస్తూనే ఉంటారు.

నిజంగా నాకు అర్థం కావడం లేదు…

ఈ ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతున్న నిరుద్యోగ మహానుభావులు ఎవరు?

అసలు వీళ్ల సమస్య ఏంటి?

ఒక మనిషిని అతని పని, సామర్థ్యం, ప్రజల కోసం చేసిన సేవతో కాకుండా… అతని మూలాలు, భాష, ప్రాంతంతో కొలవడం అంటే ఎంత దరిద్రమైన ఆలోచనో అర్థం కావడం లేదు.

పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్న ఈ హంగామా చూస్తుంటే జాలి వేస్తుంది.

ఎందుకంటే భిక్షాటన చేసే వాళ్ళు అయినా, సెక్స్ వర్కర్లు అయినా తమ కష్టంతో బతుకుతారు. సమాజానికి భారంగా ఉండరు.

కానీ కొందరు మాత్రం ఒక బిర్యానీ, ఒక బీర్ కోసం తమ ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుని సోషల్ మీడియాలో కూర్చుని విషం చిమ్ముతుంటారు.

వాళ్ల మీద కోపం కంటే జాలే ఎక్కువగా వస్తుంది.

ప్రపంచం ముందుకు వెళ్తోంది…

కానీ వీళ్లు మాత్రం ఇంకా “వాడు ఎక్కడి వాడు?” అనే ప్రశ్న దగ్గరే ఆగిపోయారు.

పాపం…

జీవితంలో సాధించడానికి ఏమీ లేకపోతే ఇలాగే ఉంటుంది కాబోలు'

అని కూచిపూడి వెంకట్ పోస్టులో పేర్కొన్నారు

Updated Date - Jun 05 , 2026 | 06:21 PM