సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Havish: నేను రెడీ.. హవీశ్‌ బర్త్‌డే లుక్‌..

ABN, Publish Date - Jun 25 , 2026 | 04:59 PM

హవీష్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. హర్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపైౖ కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు.

హవీష్ (Havish) హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’(Nenu ready). హర్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపైౖ కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, వినోదం, మాస్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతోంది.

హవీష్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు చెబితూ కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. హవిష్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్ర్కీన్‌ ప్రెజెన్స్‌, గ్లామరస్‌ నటనతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నర్గీస్‌ ఫక్రి ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటతో తెలుగు తెరకు  పరిచయం కానుంది.

విక్రాంత్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మిక్కీ జె మేయర్‌ సంగీతం, నిజార్‌ షఫీ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ సినిమాకు ఎసెట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు.త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, విటివి గణేష్‌ కీలక పాత్రధారులు.

 ఇవి కూడా చదవండి:

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Updated Date - Jun 25 , 2026 | 06:33 PM