విశ్వనాథ్ అండ్ సన్స్.. సాంగ్ ప్రోమో అదిరింది
ABN, Publish Date - Jun 17 , 2026 | 09:07 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా మంచి కలక్షన్స్ మాత్రం రాబట్టింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా మంచి కలక్షన్స్ మాత్రం రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత సూర్య నుంచి వస్తోన్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (ishwanath and Sons). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య సరసన రవీనా టాండన్, మమితా బైజు (Mamitha Baiju) నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసి అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నేనో బటర్‌ఫ్లై అంటూ సాగే ఈ సాంగ్ చాలా అద్బుతంగా ఉంది. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లోవచ్చిన సార్ సినిమా ఆల్బమ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనో బటర్‌ఫ్లై ప్రోమో వింటుంటే.. మరోసారి వీరి కాంబోలో ఒక బ్యూటిఫుల్ చార్ట్‌బస్టర్ మెలోడీ సాంగ్ లోడింగ్ అని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక వీడియోలో సూర్య క్లాసిక్ అండ్ వింటేజ్ హ్యాండ్సమ్ లుక్స్‌లో మెరవగా, మమితా బైజు అతని కింద పనిచేసే ఎంప్లాయ్ గా కనిపించింది. మోడ్రన్ లుక్ లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. నేనో బటర్‌ఫ్లై ఫుల్ సాంగ్ జూన్ 19 న రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. మరి ఈ సినిమాతో సూర్య తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.