సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Asuragana Rudra: నీ మాయ‌లో ప‌డేట్టుగా.. లిరిక‌ల్ సాంగ్‌

ABN, Publish Date - Jan 29 , 2026 | 04:53 PM

ఇటీవ‌ల వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో అల‌రిస్తూ ఇప్పుడిప్పుడే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకుంటున్న యువ న‌టుడు న‌రేశ్ అగ‌స్త్య‌.

Asuragana Rudra

ఇటీవ‌ల వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో అల‌రిస్తూ ఇప్పుడిప్పుడే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకుంటున్న యువ న‌టుడు న‌రేశ్ అగ‌స్త్య‌. ఈ మ‌ధ్య‌ గుర్రం పాపిరెడ్డి అనే సినిమాతో ఆక‌ట్టుకున్న న‌రేశ్ కొత్త‌గా న‌టిస్తున్న చిత్రం అసుర‌గ‌ణ రుద్ర (Asuragana Rudra).

జ‌న‌క అయితే గ‌న‌క ఫేమ్ సంగీర్త‌న (Sangeerthana Vipin ) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా అర్య‌న్ రాజేశ్‌, ముర‌ళీ శ‌ర్మ‌, శుభ‌లేక సుధాక‌ర్‌, శ‌త్రు, ర‌వి వ‌ర్మ‌, ప్రియా శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ (Murali Katragadda) క‌థ‌, స్క్రీన్ ప్లే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి నీ మాయ‌లో ప‌డేట్టుగా (Nee Mayalo Padettuga) అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చైతు స‌త్సంగి (Chaitu Satsangi) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా శేఖ‌ర్ చంద్ర (Shekar Chandra) సంగీతంలో ర‌మ్య బెహ‌రా (Ramya Behara), సిద్ధార్థ్ మీన‌న్ (Siddharth Menon) ఆల‌పించారు. సినిమా వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Jan 29 , 2026 | 05:01 PM